విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈనెల 31న రిలీజ్ కానుంది.
తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా జరిగింది.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, ‘గత సంవత్సర కాలంగా ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కటే అనిపిస్తుంది. మన తిరుపతి ఏడు కొండల వెంకన్న స్వామి నా పక్కనుండి నడిపిస్తే.. చాలా పెద్దోడిని అయి పోతాను. నాతోపాటు దర్శకుడు గౌతమ్, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నార’ అని అన్నారు.
‘తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్‌స్టర్ సినిమాని చూపించబోతున్నాం’ అని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.
‘కింగ్‌డమ్’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -