Monday, July 28, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకాల్పుల విరమణ చర్చలకు థాయ్‌, కాంబోడియా అంగీకారం

కాల్పుల విరమణ చర్చలకు థాయ్‌, కాంబోడియా అంగీకారం

- Advertisement -

ట్రంప్‌ ప్రకటన
ఎడిన్‌బర్గ్‌ :
కాల్పుల విరమణపై చర్చల కోసం వెంటనే సమావేశం కావడానికి థాయిలాండ్‌, కంబోడి యా అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సరిహద్దు వివాదంపై థాయ్‌, కాంబోడియా మధ్య మూడు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో 30 మంది ప్రాణాలు కోల్పోగా 1,30,000 మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌ పర్యటనలో ఉన్న ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెడుతూ కాంబోడియా ప్రధాని హున్‌ మానెట్‌, థాయిలాండ్‌ తాత్కాలిక ప్రధాని పుంతం వెచాయచైతో విడివిడిగా మాట్లాడానని తెలిపారు. ఘర్షణలను కొనసాగిస్తే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలకు విఘాతం ఏర్పడుతుందని ఇరువురు నేతలను హెచ్చరించానని చెప్పారు. వెంటనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకొని, శాంతిని నెలకొల్పాలని ఇరు పక్షాలు భావిస్తున్నా యని అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాలు తహతహలాడుతున్నాయని చెప్పుకొచ్చారు. కాగా థాయిలాండ్‌, కాంబోడియా మధ్య జరిగే చర్చల వివరాలను శ్వేతసౌధం కానీ, సంబంధిత దేశాల రాయబారులు కానీ వెల్లడించలేదు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకు నేందుకు సుముఖంగా ఉన్నామని వెచాయచై తెలిపారు. అయితే కాంబోడియా కూడా నిజాయితీతతో వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక శాంతి కోసం ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు థాయిలాండ్‌ సుముఖంగా ఉన్న విషయాన్ని కాంబోడియాకు తెలియజేయాలని ఆయన ట్రంప్‌ను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -