Monday, July 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపదేండ్లలో ఒక్క రేషన్‌కార్డూ ఇవ్వలే..

పదేండ్లలో ఒక్క రేషన్‌కార్డూ ఇవ్వలే..

- Advertisement -

– కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే నూతనకార్డులు
– ప్రజలందరికీ చేరుతున్న సంక్షేమ పథకాలు : మంత్రి పొన్నం ప్రభాకర్‌..
– సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో మంత్రి పర్యటన
నవతెలంగాణ-హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ, చిన్నకోడూరు

బీఆర్‌ఎస్‌ ప్రభత్వ పదేండ్ల హయాంలో ఒక్కరికీ కూడా రేషన్‌కార్డు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే సిద్దిపేట జిల్లాకు నూతనంగా 26వేల రేషన్‌కార్డులను మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట జిల్ల్లాలోని హుస్నాబాద్‌, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో చేపట్టిన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్దిదారులకు కార్డులు అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామ న్నారు. ఆర్థిక స్థోమత లేని వారికి మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తు న్నామన్నారు. అనంతరం పలు మండలాల్లో కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అక్కన్నపేట కేజీబీవీ పాఠశాలలో వన మహౌత్సవం కార్యక్ర మంలో పాల్గొని చెట్లు నాటారు. కోహెడ మండలంలోని తంగళ్ళపల్లి గ్రామంలోని యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ స్థలాన్ని పరిశీలించి.. పనులు వేగంగా పూర్తి చేయాలని, విద్యుత్‌ పోల్స్‌ షిఫ్ట్‌ చేయాలని అధికారులకు ఆదేశించారు. స్థలం చుట్టూ కరివేపాకు, మునగ, జామ, తదితర మొక్కలు నాటాలని సూచించారు. చిన్నకోడూరు మండలంలోని పోతారం(ఎస్‌) వద్ద జాతీయ రహదారి పక్కన వనమహౌత్సవంలో కలెక్టర్‌ కె.హైమావతితో కలిసి మొక్కలను నాటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -