Monday, July 28, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలి

విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలి

- Advertisement -

– రైతు డిక్లరేషన్‌ పూర్తిగా నీరుగార్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
– ఆగస్టు 6న వరంగల్‌లో తెలంగాణ జాగృతి వార్షికోత్సవం : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-నయీంనగర్‌

వరంగల్‌లో ఏర్పాటు చేసే విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. ఆదివారం హనుమకొండ జిల్లా ఎన్జీవోస్‌ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు దాదాపు 789మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం 400 మంది రైతులకు రూ.5 లక్షలు ఇచ్చారని, మిగతా వారికి చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారని అన్నారు. మిగతా 389 మందికి తెలంగాణ జాగృతి ద్వారా నెలకు రూ.2500 చొప్పున నాలుగు సంవత్సరాలు ఇచ్చి ఆదుకున్నామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు డిక్లరేషన్‌ పేరిట ఇచ్చిన హామీలను పూర్తిగా నీరుగార్చిందని అన్నారు. రైతు రుణమాఫీ 50శాతం మాత్రమే చేసిందని, రైతు భరోసాను నామమాత్రంగా వేస్తున్నారని ఆరోపించారు. కవులు రైతును పూర్తిగా మరిచారని అన్నారు. పంటలకు మద్దతు ధర ఎక్కడ అని నిలదీశారు. పంట బీమా, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి లింక్‌ చేస్తామని అంటున్నారని, ఇది సరైంది కదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతులను మభ్యపెడుతూనే వస్తుందని అన్నారు. ఆగస్టు 6న జయశంకర్‌ జయంతిని పురస్కరించుకొని వరంగల్‌లో తెలంగాణ జాగృతి వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్య వినయ భాస్కర్‌, మహిళా అధ్యక్షులు మాధవి, జాగృతి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -