గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ సమీపంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి తెలిపారు. కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీలో మిగిలిపోయిన సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని, పదవ తరగతిలో 8.5 జిపిఏ పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఈ నెల 12న స్పాట్ కౌన్సిలింగ్ కు హాజరుకావాలని సూచించారు. కళాశాలలో సీటు పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం జరుగుతుందని ఇట్టి అవకాశాన్ని 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Spread the love