Wednesday, October 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు 

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని మంథని గ్రామంలో మొక్కజొన్న, వరి పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ.. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 మి.లీ లేదా క్లోరాంత్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలన్నారు. వరి పొలం నాటిన 18 నుంచి 20 రోజులకు కాండం తొలిచే పురుగు నివారణకు కార్బోఫురాన్ 3జి గుళికలు 10 కిలోలు లేదా కార్తప్ హైడ్రో క్లోరైడ్ 4జి గుళికలు 8కిలోలు ఇసుకలో కలిపి చల్లుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నిషికాంత్ , రైతులు గంగారం దేవేందర్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -