నవతెలంగాణ – ఆర్మూర్
ప్రభుత్వ భూములను కాపాడాలని పట్టణంలో సీపీఐ(ఎం) ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో సైదాబాద్ శాదిఖానలో రెండవ శిక్షణ తరగతులు నిర్వహించారు. పార్టీ నిర్మాణం, మతం మతోన్మాదం క్లాసులకి ప్రిన్సిపాల్ గా కుతాడి ఎల్లయ్య వ్యవహరించగా..సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ.. మునిసిపల్ పరిధిలో గల ప్రభుత్వ అసైన్మెంట్ భూములను, చెరువులను కాపాడాలని ప్రభుత్వ న్ని డిమాండు చేశారు.
ప్రభుత్వ భూములను రియలేస్తెట్ వ్యాపారులు కబ్జా చేసి, లక్షలు సంపాదిస్తున్నా.. చూసి చూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. పెర్కేటు, మామిడిపల్లి చెరువులను కాపాడాలని అన్నారు. ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూంలను నిరుపేదలను గుర్తించి వాటిని పంచాలని అన్నారు. ఇల్లు కిరాయి కట్టలేక పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్లకు రూ.10 లక్షలు మంజూరు చేయాలని అన్నారు. రేషన్ కార్డులు ఇంకా ఇవ్వలేదని, వెంటనే రేషను కార్డులను లబ్దిదారులకు అందజేయాలని అన్నారు. రాజీవ్ వికాస్ దరఖాస్తు దారులకు వెంటనే లోన్లు ఇవ్వాలని అన్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలి డిమాండ్ చేశారు. మతం మతోన్మాదం క్లాస్ ను సీపీఐ(ఎం) జిల్లా కమిటి సభ్యు రాలు సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండ గంగాధర్, నాగరాజు, జక్కం సుజాత, టీ భుమన్న ,ఓంకార్, కుల్దిప్ శర్మ, గణేష్, పద్మ, కల్లుబై, సాయిలు, సజిత్ గంగామని,గంగనార్శయ్య, షహీద్ బేగం, మస్రత్ బేగం, తదితరులు పాల్గొన్నారు.