Saturday, July 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ తెలుగు రచయితలకు వారి రచనలను ముద్రించుకోవడానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయం అందజేయనుంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ కోట్ల హనుమంతరావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు భాష, సాహిత్యం, కళలు, చరిత్ర, సంస్కృతికి సంబంధించిన సృజనాత్మక, పరిశోధనాత్మక, విమర్శనాత్మక రచనలను ఆర్థిక సహాయం కోసం పంపొచ్చని తెలిపారు. దరఖాస్తులను విశ్వవిద్యాలయంలోని విస్తరణ సేవ విభాగం నుంచి పొందొచ్చని సూచించారు. వర్సిటీ వెబ్‌సైట్‌ www.teluguuniversity.ac.in నుంచి కూడా పొందొచ్చని తెలిపారు. దరఖాస్తులను పూర్తి చేసి ఏదేని ముద్రణ సంస్థ నుంచి పొందిన కొటేషన్‌ను తీసుకుని జతపర్చాలని కోరారు. ఈనెల 31లోగా ఇన్‌చార్జీ, విస్తరణ సేవా విభాగం, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, పరిపాలనా భవనం, సాయి నగర్‌,బాచుపల్లి ప్రాంగణం, మేడ్చల్‌ మల్కాజిగిరి- 500118 చిరునామాకు పంపాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -