ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి సుబ్బారావు మాదిగ
నవతెలంగాణ – పెద్దవంగర
మాదిగల రాజ్యాధికారం కోసం దళితులంతా సంఘటితం కావాలని ఎమ్మార్పీఎస్ మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి ముమ్ముడిపుడి సుబ్బారావు మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దలితులంతా ఏకమై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ లను బలోపేతం చేయాలన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత, మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాట ఫలితమే నేడు ఏబీసీడీ వర్గీకరణ సాధించుకున్నామని తెలిపారు. ఆయన పోరాట ఫలితమే రాష్ట్రంలో అంబులెన్సు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు అవుతున్నాయని గుర్తు చేశారు.
మాదిగలు మందకృష్ణ మాదిగ ను ఆదర్శంగా తీసుకుని, రాజ్యాధికారం కోసం కృషి చేయాలన్నారు. గతంలో ఎమ్మార్పీఎస్ లో పనిచేసిన వారిని తొలగించినట్లు ఆయన ప్రకటించారు. అనంతరం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జిగా కొత్తపళ్లి మధు మాదిగ, కో ఇంచార్జిలుగా చిలుక సిద్ధు మాదిగ, జలగం నాగరాజు మాదిగ, ఎంఎస్పీ మండల ఇంచార్జిగా జలగం శ్రీనివాస్ మాదిగ నియమితులయ్యారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈదురు సైదులు మాదిగ, సీనియర్ నాయకులు జలగం జంపయ్య మాదిగ, చిలుక బిక్షపతి మాదిగ, దంతాలపల్లి ఉపేందర్ మాదిగ, చింతల ఐలయ్య మాదిగ, చిలుక వెంకన్న మాదిగ, చిలుక సైదులు మాదిగ, చిలుక శ్యామ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాధికారం కోసం సంఘటితం కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES