- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని బ్రాహ్మణపల్లి, బంపర్ చెరువు అలుగు పారి ఉప్పొంగింది. దీంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితం మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలోని శీలం జానకీ బాయి చెరువు ,అలుగు పారుతూ.. పరవళ్ళు తొక్కుతూ.. ఇతర గ్రామాల్లోని చెరువులను, కుంటలను నింపింది. ఈ క్రమంలో ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని ఈ చెరువు సైతం పూర్తిగా నిండుకుందని గ్రామస్తులు తెలిపారు. అలుగు పారడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -