Tuesday, July 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్కానింగ్ సెంటర్ లో మోసం.. బాదితుడి ఫిర్యాదు

స్కానింగ్ సెంటర్ లో మోసం.. బాదితుడి ఫిర్యాదు

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
స్కానింగ్ సెంటర్‌లో తప్పుడు రిపోర్ట్ తో మోసం చేసి బాధితులను మోసం చేసిన ఘటన కామారెడ్డి పట్టణ కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు రాజా గౌడ్ మాట్లాడుతూ గతంలో బైక్ యాక్సిడెంట్ జరుగగా సికింద్రాబాద్ లోని ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స నిర్వహించుకొగా తన కడుపులో ఫ్లీహ గ్రంధిని డాక్టర్లు తొలగించారు.

మరొకసారి అనారోగ్యానికి గురి కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. డాక్టర్ స్కానింగ్ కోసం స్కానింగ్ సెంటర్ కు పంపించగా.. అక్కడ తమకు కడుపులో ఫ్లీహ గ్రంధి ఉన్నట్లు తప్పుడు రిపోర్టు ఇచ్చారు. రిపోర్ట్ చూసిన డాక్టర్ మళ్లీ ఆపరేషన్ చేయాలని తెలుపగా.. తాను ఇంతకుందు హైదరాబాదు ఆస్పత్రిలో అపరేషన్ చూయించుకున్నాని, రిపోర్టులు చూపించారు. వెంటనే బాధితుడు స్కానింగ్ సెంటర్ కు చెందిన శ్రీకాంత్ ను అడగగా.. ప్రింట్ తప్పు వచ్చిందని సమాధానం ఇచ్చారన్నారు. ఈ విషయంలో అతనిపై తగు చర్యలు తీసుకుని స్కానింగ్ సెంటర్ మూసివేయాలని డిమాండ్ చేస్తు తహశీల్దార్ సునీతకు బాధితుడు ఫిర్యాదు చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -