విజయ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాని నిర్మాత శ్రీని గుబ్బల నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకు 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయి. సోమవారం డైరెక్టర్ హను రాఘవపూడి ఈ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు.
ఓ కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా తీసుకొని రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. సినిమాని బిగ్ స్క్రీన్‌పై చూడాలనే క్యురియాసిటీని టీజర్ మరింతగా పెంచింది.
డైరెక్టర్ విక్రాంత్ రుద్ర మాట్లాడుతూ,’నేను 12 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఒక పర్సన్‌ని కలిసాను. ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఒక కథ చెప్పారు. అది నా మనసులో బలంగా నాటుపోయింది. ఆ కథని ఎలాగైనా ప్రపంచానికి చెప్పాలని భావించాను. అలా ఈ కథ నేను డైరెక్టర్ కావడానికి డ్రైవ్ చేసింది. నిర్మాత శ్రీనికి కథ బాగా నచ్చి, ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’ అని అన్నారు.
‘చాలా అద్భుతమైన విజువల్స్, ఎమోషన్స్, కథ ఉన్న సినిమా ఇది. అజరు కోచ్‌గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఓ మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తున్నాం’ అని నిర్మాత శ్రీని గుబ్బల చెప్పారు. హీరో విజయరామరాజు మాట్లాడుతూ,’టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఇది చాలా ఆనందాన్నిచ్చింది. మ్యూజిక్. విజువల్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇంత మంచి క్యారెక్టర్ ఉన్న సినిమా రావడం చాలా అరుదు’ అని తెలిపారు.
‘అర్జున్ చక్రవర్తి’ బ్లాక్‌బస్టర్ ఖాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES