థాయిలాండ్, కంబోడియా అంగీకారం.. తక్షణమే అమల్లోకి
కౌలాలంపూర్ : థాయిలాండ్, కంబోడియా కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరు దేశాలు తక్షణమే, బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించాయని మలేషియా ప్రధాని ఇన్వర్ ఇబ్రహీం తెలిపారు. ఏసియాన్ ప్రాంతీయ కూటమికి అధిపతిగా ఉన్న అన్వర్.. ఇరుదేశాల మధ్య చర్చలకు అధ్యక్షత వహించారు. సరిహద్దు వివాదాన్ని ముగించి, సాధారణ స్థితికి తిరిగి రావడమే లక్ష్యంగా థాయ్.. కంబోడియా నేతలతో సమావేశం నిర్వహించారు. తాజాగా ఆ చర్చలు ఫలించి ఇరుదేశాలు ఒక అవగాహనకు వచ్చినట్టు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా విలేకరుల ఎదుట థారు, కంబోడియా ప్రధానులు, అన్వర్ సమక్షంలో కరచాలనం చేశారు. ”కంబోడియా ప్రధాని హున్ మానెట్, థాయ్ తాత్కాలిక పీఎం పుమ్‌తాత్ వెచాయాచారు జులై 28 అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చే తక్షణ, బేషరతు కాల్పుల విరమణకు అంగీకరించారు.”. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం తెలిపారు.
కాల్పుల విరమణకు ఓకే
- Advertisement -
- Advertisement -



