– కనీస వేతనాల పెంపు ప్రస్తావన లేకపోవడం బాధాకరం
– ప్రసంగంలో కార్మిక సంక్షేమాన్ని విస్మరించిన సీఎం : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వేతనాల పెంపు, పర్మినెంట్, కార్మిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను మరుగునపెట్టి మేడే ఉత్సవాల్లో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రసంగా లకు పరిమితం అవ్వడం సరిగాదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ అభిప్రాయపడ్డారు. ఎంతో ఆశతో ఎదురుచూసిన కార్మిక వర్గాన్ని సీఎం ప్రసంగం నిరాశపరిచిందనీ, ఆయన ఉపన్యాసం తూతూమంత్రంగా సాగిం దని విమర్శించారు. ఈ మేరకు గురువారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి, గిగ్ కార్మికుల గురించి నామమాత్రపు ప్రస్తావన చేసి వదిలిపెట్టడం సరిగాదని పేర్కొన్నారు. షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల కనీసం వేతనాల పెంపు జీవోల జారీ, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత, పర్మినెంట్, స్కీమ్ వర్కర్లకు వేతనాల పెంపు, గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీ పర్పస్ వర్కర్స్ విధానం రద్దు, మున్సిపల్ కార్మికులకు వేతనాల పెంపు, హమాలీ, ప్రయివేటు ట్రాన్స్‌పోర్టు కార్మికు లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు లాంటి ప్రధాన సమస్యలను మరుగున పెట్టడం బాధాకరమని తెలి పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడం, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం వరకే సీఎం పరిమితం అయ్యారనీ, కోటి 20 లక్షల మంది కార్మికు లకు లబ్ది చేకూరే కనీస వేతనాలపై కనీస ప్రకటన చేయకపోవడం దారుణ మని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే సంస్థకు నష్టమని చెప్పారుగానీ వారి సమస్యలకు పరిష్కారం మాత్రం చూపలేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రతినెల 12 వేల కోట్ల రూపాయల లోటుతో నడుస్తుందని చెప్పారని తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వంపై నయా పైసా భారం పడని కోటి 20 లక్షల మందికి మేలుచేసే కనీస వేతనాలపై ఎందుకు స్పందిం చలేదని నిలదీశారు. సభ ప్రారంభంలో కనీస వేతనాల సలహా బోర్డు చైర్మెన్ మాట్లాడుతూ.. ఒప్పించి త్వరలో కనీస వేతనాలు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ సీఎం దాని గురించి ప్రస్తావించకపోవడం బాధాకరమని తెలిపారు. రాష్ట్ర హైకోర్టు కూడా ఇప్పటికే మూడుసార్లు వాటిని గెజిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసిందని గుర్తుచేశారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం యాజమాన్యాలకు అను కూలంగా వ్యవహరించడం కాక ఇంకేమవుతుందని ప్రశ్నిం చారు. కోటి 20 లక్షల మందికి కనీస వేతనాలు పెరిగితే వారి కొనుగోలు శక్తి పెరిగి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుం టుందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పు ప్రకారం జీవో 21,22 23,24,25 లను గెజిట్ చేసి అమలు చేయాలనీ, మిగతా షెడ్యూల్ పరిశ్రమల్లో కూడా కనీస వేతన జీవోలు విడుదల చేయాలని కోరారు. లేకుంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ సర్కారు కూడా కార్మికుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
మేడే ఉత్సవాల్లో రాజకీయాలేంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES