నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన ఇరుగదిండ్ల శేఖర్ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ఇటీవల చనిపోయిన ఇరుగాదిండ్ల శేఖర్, జూంబరత్ అన్వేష్ కుటుంబాలను డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పరామర్శించారు.రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇరుగాదిండ్ల శేఖర్ కుటుంబానికి మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా రూ.10వేల ఆర్థిక సహాయం మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి, భరోసాను కల్పించారు.
ఆర్థిక సహాయం అందించిన భారతీయ జనతా పార్టీ నాయకులకు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బద్దం రమేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాధారపు సతీష్, బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు దొడ్డాయిలా దామోదర్, నాయకులు గోపిడి శేఖర్, ఎర్రం నవీన్, కట్ట రాజు, అయోధ్య నరేష్, సామ మహిపాల్, గడ్డం రాజేశ్వర్, కల్లెడ నారాయణ, లక్మ రాజేష్, గడ్డం రాజేశ్వర్, బంగ్లా రమేష్, బంగ్లా దేవదాస్, రెండ్ల ప్రదీప్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.