Thursday, July 31, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజా ఉద్యమాల నిర్మాత కామ్రేడ్ భీమగాని మల్లయ్య గౌడ్

ప్రజా ఉద్యమాల నిర్మాత కామ్రేడ్ భీమగాని మల్లయ్య గౌడ్

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ప్రజా ఉద్యమాల నిర్మాత కామ్రేడ్  భీమగాని మల్లయ్య గౌడ్ ఆదర్శంగా తీసుకుని ప్రజా ఉద్యమాలను నిర్మించాలని సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు, భీమగాని మల్లయ్య గౌడ్ 16వ వర్ధంతి సభ సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి కళ్ళే స్వామి అధ్యక్షతన తన స్వగ్రామం లో జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి వర్గ  సభ్యులు మంగ నరసింహులు  మాట్లాడుతూ భీమగాని మల్లయ్య గౌడ్ ఈ ప్రాంతంలో జరిగిన ప్రజా ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచారని ఈ ప్రాంతంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా దొరల అఘాయిత్యాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడి పోరాటాలు నిర్మించిన వ్యక్తి అని అన్నారు.

ఈ ప్రాంతంలో దొరలు వ్యవసాయ కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్న తరుణంలో, దొరలకు వ్యతిరేకంగా నిలబడి వ్యవసాయ కార్మికుల కూలీలు పెంచాలని వీధి నాటికల ద్వారా కళారూపాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమాలు నిర్మించారని అన్నారు అని అన్నారు. తాను బ్రతికి ఉన్నంతకాలం ఎర్రజెండా నీడలో కార్మికులు కర్షకులు పేదలను ఐక్యం చేసి అనేక భూపోరాటాలు నిర్మించి సిపిఎం పార్టీ నాయకత్వంలో పేదలకు భూములు పంచిన చరిత్ర కామ్రేడ్ భీమగాని మల్లయ్య గౌడ్ కు ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి నాయకులు భీమగాని రాములు గౌడ్, జోగు యాదగిరి, మిర్యాల చంద్రయ్య, జోగు శ్రీనివాస్, పత్తి నరసింహులు, గుర్రం నరసింహులు, భీమగాని మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -