నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ఆదివాసి గిరిజన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం నగరంలోని హరిత హోటల్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాలు మహమ్మద్ అలీ షబ్బీర్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ..జల్ – జమీన్ – జంగిల్ ( నీరు,అటవీ, భూ వనరులు) పై గిరిజన హక్కుల కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉంది.సహజ వనరులపై గిరిజనుల హక్కుల కోసం రాహుల్ గాంధీ గారు యాత్ర చేశారు. ప్రధానిగా రాహుల్ గాంధీ చూడాలని మనందరి కల.
ఈకల కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి. ప్రజల ఆక్రందన, ఆవేదనను అర్థం చేసుకోవడమే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర లక్ష్యం.గిరిజనుల హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోంది. పెట్టుబడి దారుల లబ్ధి కోసం మోదీ ప్రభుత్వం గిరిజనుల హక్కులను లాక్కోవడానికి కుట్ర పన్నుతోంది. బీజేపీ ఇప్పటికీ మతం పేరిట రాజకీయాలు చేసి ఓట్ల లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోంది. గిరిజనుల కోసం పరితపిస్తున్న నాయకుడు రాహూల్ గాంధీ. కాంగ్రెస్ పార్టీ ఆదివాసిల పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేసింది. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసులు గిరిజనులు అమాయకులు, వారు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
వారిపై కొన్ని దుష్టశక్తులు మను వాదాన్ని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ హయాం నుండి ఆదివాసుల కోసం దళిత గిరిజనులకు సమాజంలో సమానత్వం కోసం నేటి వరకు పనిచేస్తూనే ఉంది. ఆదివాసుల మేలుకోరకు కుల గణన సర్వే ,తెలంగాణలో చేసిన సర్వే పై దేశ వ్యాప్తంగా చర్చ జరగుతుంది. కుల గణన సర్వే 90 శాతం పూర్తయింది గిరిజనులు న్యాయపరమైన హక్కుల కోసం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది.
అటవీ హక్కుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింద గిరిజనులు మొదట విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. గిరిజనులు అటవీ భూములు ,ఇతర వనరులు హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ఎల్లపుడూ పోరాడుతూనే ఉంటుంది.గత పదేళ్లలో బిఆర్ఎస్ తెలంగాణాను అప్పుల కుప్పగా మార్చింది, రానున్న రోజుల్లో మిగతా హామీల అమలు కోసం కృషి చేస్తాం.ఈ శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన వారు ఆదివాస గిరిజనులకు సరైన మార్గంలో నడిపించి రాహుల్ గాంధీని ప్రధాని చేసేవరకు కష్టపడాలి పోరాటం చేయాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.