Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేంద్రం వివక్ష - షరతులు లేకుండా రైతులకు ఎరువుల అందించాలి: సీపీఐ(ఎం)

కేంద్రం వివక్ష – షరతులు లేకుండా రైతులకు ఎరువుల అందించాలి: సీపీఐ(ఎం)

- Advertisement -
  • గ్రోమోర్ ఎరువుల సెంటర్ సందర్శించిన సీపీఐ(ఎం) నాయకులు
  • నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
  • రాష్ట్ర రైతాంగానికి ఎరువులు సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని సీపీఐ(ఎం) హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు గుగులోతు శివరాజ్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల సెంటర్ ను సందర్శించి ఎరువుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రోమోర్ లో 300 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా కేవలం 20 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉందని డీఏపీ కొరత ఉందని గుర్తించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శివరాజ్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో ఆలస్యంగా వర్షాలు పడటంతో రైతులకు సకాలంలో యూరియా, డి ఏ పి, సరిపడేంత అందుబాటు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

    బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సినంత ఎరువులను సరఫరా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రం యూరియా బస్తాకు సబ్సిడీ 2000, డిఎపి వస్తాకు 1700 సబ్సిడీ ఇస్తుండగా దాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా రైతులు ఎక్కువగా ఎరువులు వాడటం వలన భూసారం, తగ్గుతుందని కుట్ర చేస్తుందన్నారు.  ఎరువుల్లో కోత విధించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలైన సొసైటీ, ఆగ్రోస్, గ్రోమోర్, రైతు మిత్ర, సర్వీస్ సెంటర్లకు యూరియా, డిఎపి కొంత వచ్చినప్పటికీ రైతుల దగ్గర 50 రూపాయలు ఎక్కువకు అమ్ముతూన్నారాన్నారు. రైతులకు యూరియా కావాలంటే ఇతర పత్తి మందులు తీసుకుంటేనే ఎరువుల బస్తాలు ఇస్తామని లింకు పెట్టి రైతులను నిలువు దోపిడీ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.

    ఒక రైతుకు 5 ఎకరాలు ఉన్న రెండే బస్తాలు యూరియా ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రైతులకు సరిపడా ఎరువులను ఆయా గ్రామాల్లోని పంపిణీ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఎలాంటి షరతులు లేకుండా రైతులకు సరిపడా ఎరువులను అందించి రైతులను న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు గూగులోతు రాజు నాయక్, గిన్నారపు ప్రవీణ్, లోకేష్ రాయుడు, బిక్షపతి, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -