నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలో పీసీసీ మాజీ కార్యదర్శి ఖాందేష్ శ్రీనివాస్ మాతృమూర్తి ఖాందేష్ గంగుబాయి ఆధ్వర్యంలో పట్టణములోని జిరాయత్ నగర్ లో మంగళవారం 450 మంది ప్రజలకు, భక్తులకు ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాందేశ్ శ్రీనివాస్ నాన్న కీ.శే. ఖాందేశ్ రామయ్య నాగుల పంచమి ఈ ఆవుపాల పంపిణీ కార్యక్రమాన్ని గత 35 సం,,ల క్రితం ప్రారంభించారు. ఈ ఆనవాయితీని కుటుంభ సభ్యులు కొనసాగించడం గొప్ప విషయం. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ మాజీ కౌన్సిలర్, బార్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షులు, లీగల్ కౌన్సిల్ మెంబర్, ప్రముఖ మహిళా న్యాయవాది సంగీత ఖాందేష్ మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా మా కుటుంబ సభ్యులము పవిత్ర నాగుల పంచమి పర్వదినం సందర్భంగా ఉచితంగా ఆవు పాలు పంపిణీ చేయడం చాలా గర్వకారణంగా వుందని, మేము ఇట్టి మహత్తర కార్యక్రమములో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు సత్యం, కుటుంభ సభ్యులు గంగు బాయ్, నరేందర్, సురేష్, ఆదిత్య, వెంకట వైభవ్, నాగలత తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో ఉచితంగా ఆవుపాల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES