Thursday, July 31, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లకు ఘన సన్మానాలు..

బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లకు ఘన సన్మానాలు..

- Advertisement -

 నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టర్స్ వైద్యరత్న  అవార్డ్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సమాజానికి అత్యంత కీలకమైన సేవలందిస్తున్న వైద్యుల పట్ల కృతజ్ఞతా చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జైపాల్, ఫిషరీ కార్పొరేషన్ చైర్మన్   మేట్టు సాయికుమార్, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్  నూతి శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్, రజక సంఘం నాయకులు శ్వేతా ఐలమ్మ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులకు వైద్యరత్న అవార్డు లతో ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో బీసీలు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బిసి ఫెడరేషన్ కులాల సమితి నీ వారు అభినందించారు.

బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లపు దుర్గారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్, రాష్ట్ర కోశాధికారి పసుపులేటి కరుణాకర్, అవార్డ్స్ కమిటీ కన్వీనర్ శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీసీ వర్గాలకు చెందిన వైద్యులు అత్యంత ప్రతిభతో, సేవా తపనతో వ్యవహరిస్తున్నారని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న డాక్టర్లను గుర్తించి అవార్డుల రూపంలో సత్కరించడం బీసీ ఫెడరేషన్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వారు అందించిన వైద్య సేవలు సమాజానికి ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్య భద్రతను అందించాయని కొనియాడారు.

అంతేకాకుండా, బీసీ ఫెడరేషన్ కులాల సమితి ద్వారా బీసీ వర్గాల ప్రగతికి జరుగుతున్న కృషిని వారు ప్రశంసించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్లు తమ అనుభవాలను పంచుకుంటూ, బీసీ సంఘాల మద్దతును అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర  కార్యదర్శి చేర్యాల రాకేష్,ఉపాధ్యక్షులు డాక్టర్ వీర భోగ వసంత రాయలు, షేక్ సయ్యద్ బాషా, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సంఘ వీరప్ప, సోషల్ మీడియా కన్వీనర్ దుర్గ ప్రసాద్ పెద్ద ఎత్తున నాయకులు , వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -