Friday, August 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వికలాంగులు, వృద్ధులు,వితంతువుల, బీడీ కార్మికుల పించన్లు తక్షణమే పెంచాలి..

వికలాంగులు, వృద్ధులు,వితంతువుల, బీడీ కార్మికుల పించన్లు తక్షణమే పెంచాలి..

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి…
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

జక్రన్ పల్లి మండలం బ్రాహ్మణ పల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి శ్యామ్ ఆధ్వర్యంలో వికలాంగులు, వృద్ధులు సమక్షంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు 31వ ఆవిర్భావ దినోత్సవ సంబరాలలో భాగంగా ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జి కూడాల స్వామి, ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నాయకులు మైలారం బాలు మాట్లాడుతూ రాష్ట్రంలోనీ చేయూత పెన్షన్ దారులైనా 45 లక్షల మంది వికలాంగులు, వృద్ధులు, వితంతువుల, బీడీ కార్మికులు, గీతా కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని 20 నెలలు గడిచిన కాలయాపన చేస్తూ  పెన్షన్ దారులు మభ్యపెడుతుందని ఇకనైన ప్రభుత్వం కళ్ళు తెరిచి వికలాంగులకు రూ.6000 రూ పెంచి ఇవ్వాలని, వంద శాతం శారీరక వికలాంగులకులు రూ.15000 ఇవ్వాలని , బీడీ కార్మికులు,వృద్ధులు, వితంతువులు,గీతా కార్మికులకు 4000 రూ తక్షణమే పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు.

పెన్షన్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు వచ్చే నెల 5వ తేదీన ఆర్మూర్ ఎం ఆర్ గార్డెన్ లో చేయూత పెన్షన్ దారుల సన్నాహక గర్జన సభ జరుగుతుందని చేయుత పెన్షన్ దారు లు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు వడ్నల గంగాధర్, సరిత, భూమక్క, గంగామణి, సంతోష్,ఉట్నూర్ గంగాధర్,బాయి గంగాధర్ , బరుకుంట్ల గంగాధర్ ,నడిపి గంగారాం,సుమన్,డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -