ఎమ్మెల్యే సొంత ఖర్చులతో కెనాల్ కాలువ మరమ్మతులు
నవతెలంగాణ – పెద్దవంగర
రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంత ఖర్చులతో గ్రామంలో చేపట్టిన చెరువు కెనాల్ కాలువ మరమ్మత్తు పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. గత పాలకులు పదేళ్ళలో ఏనాడూ కెనాల్ కాలువల మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. కాలువల్లో చెట్లు పెరిగిపోయి, కొన్నిచోట్ల కాలువల్లో వ్యర్ధాలు పేరుకుపోయి పూడిక నిండి నీటి సరఫరాకు ఆటంకంగా మారిందన్నారు.
ఈ సమస్యను గుర్తించి, ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చారు. రైతుల ఇబ్బందులను గమనించి వెంటనే తన సొంత ఖర్చులతో కెనాల్ కాలువ మరమ్మత్తు పనులను చేపట్టామని తెలిపారు. రైతులకు సాగునీరు కష్టాలు లేకుండా చూస్తానని పేర్కొన్నారు. గోదావరి జలాలతో నియోజకవర్గంలోని రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు బోనస్ వంటి అనేక పథకాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తుందని అన్నారు. టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
బీఆర్ఎస్ హాయాంలో కనీసం పేద ప్రజలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయరన్నారు. ప్రజా ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని వెల్లడించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలన్నారు. అనంతరం గ్రామంలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, సీనియర్ నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, ముత్తినేని శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్స్ బానోత్ గోపాల్, ముత్యాల పూర్ణచందర్, ఇరిగేషన్ శాఖ డీఈ పూర్ణచందర్, ఏఈ రమ్య, కాంగ్రెస్ మండల నాయకులు పొడిశెట్టి సైదులు, రంగు మురళి, బానోత్ సీతారాం, దాసరి శ్రీనివాస్, ఓరిగంటి సతీష్, బండారి వెంకన్న, దంతాలపల్లి రవి, దంతాలపల్లి ఉపేందర్, జాటోత్ వెంకన్న, డాక్టర్ సంకెపల్లి రవీందర్ రెడ్డి, బీసు హరికృష్ణ, ఆవుల మహేష్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి మల్లికార్జున చారి, గద్దల ఉప్పలయ్య, జాటోత్ వెంకన్న, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, రమేష్, యాకయ్య, మల్లేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES