Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మేడారం ఆలయ పరిధిలో అభివృద్ధికి చర్యలు..

మేడారం ఆలయ పరిధిలో అభివృద్ధికి చర్యలు..

- Advertisement -

సమ్మక్క- సారలమ్మ దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ దివాకర టి.ఎస్.
నవతెలంగాణ – తాడ్వాయి 

మేడారం సమ్మక్క- సారలమ్మ  మహా జాతర ప్రాంగణంలో చేపట్టే అభివృద్ధి పనులను శాశ్వత ప్రతిపాదించిన నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తుందని, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు. బుధవారం తాడ్వాయి మండలంలోని సమ్మక్క- సారలమ్మ దేవాలయం లో జరుగుతున్న షేడ్ నిర్మాణ పనులను, క్యూలైన్లను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు వెడల్పు, గజ్జల ప్రాంగణంలో క్యూలైన్లో మార్పులు చేర్పుల ఏర్పాట్లు మాస్టర్ ప్లాన్ తో ఎండోమెంట్ పోలీస్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ .. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ తో మేడారాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

అందరూ వనదేవతల దర్శనానికి వచ్చి దర్శించుకుని ఎవరి ఇళ్లకు వారు క్షేమంగా ఇళ్లల్లో చేరేటట్లు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు వనదేవతల దర్శించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, స్థానిక తాసిల్దార్ జె సురేష్ బాబు, ఎండోమెంట్ ఈవో మేకల వీరస్వామి, పూజార్ల సంఘం అధ్యక్షులు సిద్దబోయిన జగ్గారావు. కాక సారయ్య, కాక కిరణ్, కొక్కెర కుక్కెర కృష్ణయ్య, సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజు ల పూజారులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad