నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నియోజక వర్గం కేంద్రం అశ్వారావుపేట మండలంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా మామిళ్ళవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలువురి ఆర్ధిక చేయూత తో ఏర్పాటు చేసిన పాఠశాల గ్రంథాలయాన్ని ప్రారంభించి ఎంఈఓ ప్రసాదరావు ను అభినందించారు.
స్థానిక విద్యావంతులను, ఉద్యోగులను ఎమ్మెల్యే తాను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేను సైతం విద్యాభివృద్ధికి చేయూత కార్యక్రమంలో భాగస్వామ్య మై వారి వారి సొంత గ్రామాలలో ఉన్న పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేసే కార్యక్రమాలకు చేయూతనివ్వాలని కోరారు. అనంతరం కొండతోగు మారుమూల గిరిజన గ్రామాన్ని సందర్శించి నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలను భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్,డీడీ మణెమ్మ, ఎంపీడీవో అప్పారావు,ఎంఈఓ ప్రసాద్ రావు,ఉన్నత అధికారులతో కలిసి ప్రారంభించారు.
నియోజక వర్గం కేంద్రంలోని రైతు వేదిక లో నిర్వహించిన ఆకాంక్ష మేళ వోకల్ ఫర్ లోకల్ ఆకాంక్షిత జిల్లా కార్యక్రమం స్వయం సహాయక సంఘం మహిళల చే తయారు చేయబడిన ఉత్పత్తుల ప్రదర్శన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ క్యాంపు కార్యాలయం లో మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల హక్కు పట్టాలను లబ్ధిదారులకు అందించారు.
శ్రీ శ్రీ కళ్యాణ మండపం లో నిర్వహించిన కలకోటి వారి నిశ్చయ తాంబూలాలు వేడుకకు హాజరై నూతన కాబోయే దంపతులను ఆశీర్వదించారు. పేరాయిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన నార్లపాటి సూరిబాబు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు తుమ్మ రాంబాబు,నాయకులు జూపల్లి రమేష్,సుంకవల్లి వీరభద్ర రావు,మిండ హరిక్రిష్ణ, సూరనేని ఫణి, వేల్పుల సత్యనారాయణ, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.