మేడారంలో వైద్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ – తాడ్వాయి
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, వైద్య అధికారులను ఆదేశించారు. బుధవారం మేడారంలో తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు తీసుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ ఈ వర్షాకాలం సీజన్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తతో ఉండి మలేరియా, డెంగ్యూ, కలరా, విరేచనాలు నియంత్రించాలని సూచించారు.
ఫీవర్ సర్వే చేయాలని ఇంటింటి సందర్శనలో దోమల లార్వాను కలిగిన నీటిని తొలగించాలని, ప్రతి జ్వర పీడితులకు మలేరియా డెంగ్యూ ఆర్డిటి వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. వైద్యులు వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్నలను పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం సి హెచ్ టీం డాక్టర్ కీర్తి, స్టాఫ్ నర్స్ మమత, సూపర్వైజర్ సరస్వతి, ఆరోగ్య కార్యకర్త రాజ్యలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ చేల తిరుపతయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES