Saturday, August 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ అధ్యక్షుడికి మతిభ్రమించింది

బీజేపీ అధ్యక్షుడికి మతిభ్రమించింది

- Advertisement -

ఆయన్ని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ రామచంద్రరావు ఖమ్మం పర్యటనలో ఈ జిల్లాలో ఉండే కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలంటూ మాట్లాడిన వ్యాఖ్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు కమ్యూనిస్టులకు అడ్డాగా ఉన్న ఖమ్మం ఇక ముందు బీజేపీకి అడ్డాగా మారాలంటూ కలలు కంటున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయనకు మతి భ్రమిం చిందని విమర్శించారు. ఆయన్ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించాలని కోరారు. లేదంటే బీజేపీ మొత్తానికి ఆ పిచ్చి పడుతుందని తెలిపారు. బీజేపీ మతోన్మాద, మనువాద పార్టీ అని పేర్కొన్నారు. అది కులవ్యవస్థను పెంచుతుందనీ, దేశ సంపదను కార్పొరేట్లకు, సామ్రాజ్యవాద దేశాలు దోపిడీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నదని విమర్శించారు. ప్రజల మధ్య మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని తెలిపారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారు జైళ్లకు వెళ్తే వారిని విడుదల చేయించి పూలదండలు వేసి ఊరేగింపులు చేస్తుందని పేర్కొన్నారు. దళిత మహిళలపై లైంగిక దాడులకు పాల్పడి ఆ శవాలను తల్లిదండ్రులకు కూడా ఇవ్వకుండా తగలబెట్టిన ఘటనలున్నాయని తెలిపారు. మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించినా, ప్రధాని మోడీ ఆ సమస్య గురించి పట్టించుకోలేదని పేర్కొన్నారు. మతోన్మాద బీజేపీలోకి కమ్యూనిస్టులను రమ్మనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. దోపిడీ వ్యవస్థ ఉండొద్దనీ, శ్రామిక వర్గాల రాజ్యం రావాలనీ, స్త్రీ, పురుష అసమానతలు పోవాలనీ, పేద, ధనిక వ్యత్యాసం ఉండొద్దనీ, అందరికీ విద్యావైద్యం, ఉపాధి అవకాశాలుండాలనీ, అందరూ సమానంగా ఆత్మ గౌరవంతో బతికే సమాజం కావాలని కమ్యూనిస్టులు కోరుకుటారని వివరించారు. మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని తెలిపారు.
కానీ కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలంటూ రామచంద్ర రావు పగటి కలలు కనడం మానాలని సూచించారు. ఖమ్మం గతం, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ కమ్యూ నిస్టులకు అడ్డాగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకించే ప్రజలు న్నారని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తు న్నారనీ, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని కాపాడేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పోరాటాలకు స్ఫూర్తిగా ఉందని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -