Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పలు గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ 

పలు గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ 

- Advertisement -

– మండల పంచాయతీ అధికారి సదాశివ్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలోని పలు గ్రామాల్లో దోమల నివారణకు స్థానిక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఫాగింగ్ చేయించినట్లు మండల పంచాయతీ అధికారి సదాశివ్ తెలిపారు. మండలంలోని హాస కొత్తూర్, కోన సముందర్, కమ్మర్ పల్లిలో డబుల్ బెడ్ రూమ్ కెసిఆర్ కాలనీలో దోమల మందు పిచికారి చేయించినట్లు తెలిపారు.ఇటీవల కురిసిన వర్షాల మూలంగా  దోమలు వృద్ధి చెందే ఆస్కారం ఉన్న నేపథ్యంలో  దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయించారు. ప్రజలు కూడా గ్రామాల్లో పారిశుధ్యం కాపాడేందుకు  పంచాయతీ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి దోమలు ఎక్కువైతే ప్రజలు విష జ్వరాలను పాడిన పాడుతారన్నారు. పరిశుద్ధాన్ని కాపాడడం తమ బాధ్యతగా ప్రజలు భావించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -