Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యుల భర్తీ 

ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్యుల భర్తీ 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ నందు ఖాళీగా ఉన్నటువంటి ప్రొఫెసర్-3, అసోసియేట్ ప్రొఫెసర్-5, అసిస్టెంట్ ప్రొఫెసర్-31, ట్యూటర్-5, సీనియర్ రెసిడెంట్-24 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అదనపు డిఎంఈ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ కృష్ణమోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టుల దరఖాస్తుల స్వీకరణ ఈనెల 11 వరకు సాయంత్రం 4 గంటల వరకు పని దినాలలో దరఖాస్తులను ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయంలో స్వీకరించబడును అని అన్నారు.

దరఖాస్తు చేసుకున్నా అభ్యర్ధులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఈనెల 13 న సమయం 11 గంటలకి ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయంలో హాజరు కాగలరు అని, ఈ పోస్టుల సెలక్షన్ కొరకు వాకిన్ ఇంటర్వ్యూ ఈనెల 14.న సమయం ఉదయం 11 గంటలకు ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కార్యాలయం నందు హాజరు కాగలరు అని అన్నారు. మరిన్ని వివరాల కొరకు కళాశాల వెబ్సైట్ www.gmcnzh.org ను సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -