– సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్‌లో ఘటన
నవతెలంగాణ-జగదేవ్‌పూర్
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఓ యువరైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తీగుల్ గ్రామానికి చెందిన బుధారి నరేందర్(34) తనకున్న అరెకరా భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య రేవతి, ముగ్గురు సంతానం. అయితే వ్యవసాయ ఖర్చులతో పాటు ఇంటి నిర్వహణ కోసం చేసిన రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. అవి తీరక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇటీవల అర ఎకరా నుంచి ఎనిమిది గుంటల భూమిని అమ్మినా.. అప్పు పూర్తిగా తీరలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం పంట చిట్టి చెల్లించాల్సి ఉండగా.. డబ్బు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. దాంతో తన వ్యవసాయ పొలంలో వేప చెట్టుకు ఉరేసుకొని మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఎస్‌ఐ తెలిపారు.
ఆర్థిక సమస్యలతో యువరైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -