ఉగ్రవాదాన్ని నిర్మూలిద్దాం.. దేశ రక్షణకు కట్టుబడి ఉందాం: ముస్లింలు
ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాము..
భారత్ అన్నం తింటున్నాం.. భారతదేశానికే కట్టుబడి ఉంటాం..
కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ నాయకులు జావిద్ పటేల్
నవతెలంగాణ – మద్నూర్: ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మద్నూరు మండల కేంద్రంలో శుక్రవారం ముస్లిం సోదరులు నల్ల బ్రాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ ఆందోళన చేపట్టారు. ఉగ్రవాదాన్ని నిర్మాలిద్దాం.. దేశ రక్షణకు కట్టుబడి ఉందాం .. ఉగ్రవాదులారా ఖబడ్దార్.. డౌన్ డౌన్ అంటూ భారీ నినాదాలతో మసీదు నుండి మండల కేంద్రంలో మెయిన్ వీధుల గుండా గాంధీ చౌక్ మీదుగా భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మండల అధ్యక్షులు జావిద్ పటేల్ మాట్లాడుతూ.. మేమంతా ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాము.. భారత్ దేశంలోనే జీవిస్తున్నాం.. ఇక్కడి అన్నమే తింటున్నాం.. భారతదేశానికే కట్టుబడి ఉంటాం. ఉగ్రవాద నిర్మూలనకు భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా మేమంతా కట్టుబడి మద్దతుగా ఉంటామని తెలిపారు. పాకిస్తాన్ కు ఇక్కడి ముస్లింలకు ఎలాంటి మద్దతు ఉండదని, ఉగ్రవాదాన్ని నిర్మూలించడమే సరైన చర్య అని అన్నారు. భారతదేశం కోసం హిందూ.. ముస్లిం భాయి భాయిగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిరసన ర్యాలీలో హిందూ సోదరులు ధరాస్ సాయిలు, పాకాలవార్ విజయ్ కృష్ణ పటేల్ తెప్ప తుకారం జి లక్ష్మణ్ తదితరులతో పాటు ముఖ్య ముస్లిం సోదరులు మజీద్ సాదార్ ఎజాజ్ హైమద్, యాసీన్ ఇస్మాయిల్, భగవాన్ షకీల్, హజీం, అస్లాముద్దీన్, ఖాజా మియ, రైస్ కాన్ బషీర్, ముస్లిం పెద్దలు చిన్నారులు పాల్గొన్నారు.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ముస్లిం సోదరుల నిరసన ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES