Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిజాంసాగర్ జలాశయం వద్ద ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ 

నిజాంసాగర్ జలాశయం వద్ద ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
నిజాంసాగర్ జలాశయం వద్ద రూ.9 కోట్ల 98 లక్షల రూపాయలతో  ఎకో టూరిజం అభివృద్ధికి  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ టూరిజం కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి  స్వదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ జలాశయం వద్ద ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.9 కోట్ల 98 లక్షలను  మంజూరు చేయడం జరిగిందని  అన్నారు.

నిజాంసాగర్ జలాశయం వద్ద ఇప్పటికే 12 ఎకరాల 30 గంటల భూమిని  ఎకో టూరిజం అభివృద్ధికి సేకరించడం  జరిగిందని, గుర్తించిన ఆ స్థలంలో వెంటనే భూమి చదును, పిచ్చి మొక్కల తొలగింపు పనులు త్వరగా పూర్తి చేసి ఎకో టూరిజం  అభివృద్ధిలో భాగంగా డీలక్స్ రూమ్ లు, సూట్ రూమ్ లు,  యోగా సెంటర్, రెస్టారెంట్, డార్మెటరీ, మెయిన్ ఎంట్రెన్స్ ఆర్చ్, థీమ్ గార్డెన్, చిన్న పిల్లల  ప్లే ఏరియాల నిర్మాణాల కోసం శంకుస్థాపనకు సిద్ధం చేయాలని  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టూరిజం కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డిఈ విద్యాసాగర్, ఏఈ సోహెల్, జిల్లా టూరిజం అధికారి జగన్నాథం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -