Sunday, August 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

- Advertisement -

నవతెలంగాణ -హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కేటీఆర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల సమర్పించిన వాదనలను కోర్టు సమర్థించింది. సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలు, సమర్పించిన పత్రాలు, ఫిర్యాదును పరిశీలించిన తర్వాత, సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయడానికి తగిన ఆధారాలు ఉన్నట్లు గుర్తించింది.

కొండా సురేఖ తరపు వాదనలను తోసిపుచ్చిన కోర్టు.. అమె తరపు న్యాయవాది లేవనెత్తిన పలు అంశాలను కోర్టు తిరస్కరించింది. ఫిర్యాదు ఊహాగానాలపై ఆధారపడిందన్న వాదనను అంగీకరించలేదు. పెన్‌డ్రైవ్‌కు 65-B సర్టిఫికేట్ అవసరం అనే వాదనను ఈ దశలో అప్రస్తుతమని తేల్చింది. విచారణ సమయంలో అది పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -