Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జంక్ ఫుడ్ వలన ఆరోగ్యం పాడవుతుంది

జంక్ ఫుడ్ వలన ఆరోగ్యం పాడవుతుంది

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
జంక్ ఫుడ్ వలన ఆరోగ్యం పాడవుతుందని సిద్దార్థ పాఠశాల కరస్పాండెంట్ సుధకర్ తెలిపారు. శనివారం పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. 6 నుండి 10వ తరగతి విద్యార్థులు వారి వారి తల్లిదండ్రుల సహకారంతో 60 రకాల వంటకాలు చేసి పాఠశాల ఆవరణలో ప్రత్యేక ప్రదర్శన చేశారు. వంటకాల తయారీ విధానం, వాటిలో ఉండే పోషకాల గురించి వివరించారు. జంకు ఫుడ్ వల్ల కలిగే దుష్పలితాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ లింగాల శ్రీకాంత్ గౌడ్, ఉపాధ్యాయులు మోహన్ గౌడ్, రవి,బాబు, వాసంతి, కల్పన, భాస్కర్, సర్దార్, శైలజ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -