Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మొర్రం స్థానంలో గుండ్లవాగు ఇసుక

మొర్రం స్థానంలో గుండ్లవాగు ఇసుక

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
పస్రా గ్రామపంచాయతీ పరిధిలోని 11వ వార్డు, సమ్మక్క–సారక్క వాటర్ ప్లాంట్ పక్కన ఉన్న సన్నగల్లీ  గుండ్ల వాగు రాళ్ల ఇసుకపయడంతో ప్రమాదకరంగా మారింది. గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో పంచాయతీ అధికారులు ఈ గల్లీని మరమ్మతు చేయాలని నిర్ణయించినా, పనుల నాణ్యతపై నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.మొరం వేయాల్సిన రహదారిపై అధికారులు గుండ్లవాగు నుంచి తెచ్చిన పెద్ద పెద్ద రాళ్లతో కలిసిన ఇసుకను పోసేశారు. చిన్నచిన్న గుండ్రని రాళ్లు కాకుండా, ఈ సారి వాడినవి గుడ్డు పరిమాణంలో ఉన్న పెద్ద రాళ్లు. ఫలితంగా, పాదచారులు, సైకిల్, బైక్ సవారీదారులు ఈ మార్గంలో నడవడం, వెళ్లడం కష్టమైపోతోంది.

వర్షం పడితే మరింత ముప్పు ఇప్పటికే ఇసుకలోని రాళ్లు కదిలి, వాహనాలు జారి పడే పరిస్థితి ఏర్పడింది. వర్షం పడితే రాళ్లు మరింత జారిపడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. “పిల్లలు పాఠశాలకు వెళ్లే సమయంలో తడబడి పడిపోతున్నారు. వృద్ధులు నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది అభివృద్ధి పని కాదు, ప్రజల ప్రాణాలతో ఆట” అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.చేతులు దులుపుకున్న అధికారులు స్థానికుల ఆరోపణ ప్రకారం, పనులు పూర్తి చేసి ఫోటోలు తీసి పైఅధికారులకు పంపించారేమో తప్ప, పనుల నాణ్యతను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. “మొరం వేయాల్సిన పనిని చవకబారు రాళ్లతో నింపేసి వెళ్లిపోయారు. ఈ గల్లీ పరిస్థితి మరింత దారుణంగా మారింది” గల్లీలోని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా,  పంచాయతీ అధికారులను తక్షణమే స్పందించి రాళ్లతో నిండి ఉన్న ఇసుకను తొలగించి, నాణ్యమైన మొరం వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే, రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -