Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్6న పోచమ్మ తల్లికి బోనాల పండగ 

6న పోచమ్మ తల్లికి బోనాల పండగ 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఈనెల ఆరవ తేదీన పసర గ్రామంలో పోచమ్మ  తల్లికి బోనాల చెల్లింపు ఉంటుందని అర్చక స్వామి డింగిరి రంగాచార్యులు తెలిపారు. శనివారం  పస్రా రామాలయంలో  ఆలయ కమిటీ మరియు ప్రధాన అర్చకులు డింగరి రంగాచార్యులు ఆధ్వర్యంలో రామాలయం కమిటీ  సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామంలోని పోచమ్మ తల్లి బోనాల నిర్వహణపై చర్చించి, పంతులు సూచన మేరకు ఈనెల   6వ తేదీ బుధవారం రోజున అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ – “అమ్మవారి బోనాలు మా గ్రామానికి శ్రేయస్సు, శాంతి, సమృద్ధి తీసుకువస్తాయి. ప్రతి కుటుంబం పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి” అని పిలుపునిచ్చారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -