Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహాత్మ హై స్కూల్లో బోనాల సంబరాలు

మహాత్మ హై స్కూల్లో బోనాల సంబరాలు

- Advertisement -

– అమ్మవారు, పోతురాజుల వేషధారణలో చిన్నారులు
– ఆకట్టుకున్న విద్యార్థుల సంస్కృతిక కార్యక్రమాలు
– గ్రామ దేవత మరమ్మతల్లికి మొక్కులు చెల్లించిన విద్యార్థులు
నవతెలంగాణ – రాయపర్తి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల వేడుకలు శ్రీ మహాత్మ హై స్కూల్లో శనివారం నేత్ర పర్వంగా హోరెత్తాయి. బోనాలను సంప్రదాయకరంగా తయారు చేసి, బోనాలతో విద్యార్ధులు అమ్మవారికి పూజలు చేశారు. అమ్మవారి, పోతురాజు వేషధారణలతో విద్యార్థులు కనువిందు చేశారు. విద్యార్థినిలు చీరకట్టు సాంప్రదాయ దుస్తులలో బోనాల సంబరాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మవారి వేషధారణలతో, పోతురాజు వేషధారణలతో విద్యార్థినీ విద్యార్థులు ఆకట్టుకున్నారు. విద్యార్థుల సంస్కృతి కార్యక్రమాలు చూపరులను కనువిందు చేశాయి. అనంతరం విద్యార్థులు బోనాలు ఎత్తుకొని డీజే సప్పులతో నృత్యాలు వేస్తూ ర్యాలీగా వెళ్లి ప్రజల ఇలవేల్పు శ్రీమారమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా శ్రీ మహాత్మ హై స్కూల్ డైరెక్టర్ కుంట రమేష్, ప్రధానోపాధ్యాయుడు సరికొండ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు విశిష్టమైన స్థానంతో పాటు కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలతో మహోన్నత స్థానం ఉందన్నారు. ఆషాడ మాసం, శ్రావణ మాసాలలో బోనాల సంబురాలతో ప్రజానీకం మురిసిపోతున్నారు అని తెలిపారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు పండుగల విశిష్ట, సంస్కృతి సాంప్రదాయాలను తెలపడానికి ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు పర్వదినాల గొప్పతనాన్ని తెలుపడం జరుగుతుందన్నారు.

పాఠశాల విద్యార్థులకు బోనాల విశిష్టతను తెలియజేసేందుకు పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాల సంబురాలని జరుపుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ కిరణ్, ఉపాధ్యాయులు దయాకర్, పండరినాద్, రవీందర్, మహేందర్, కపిల్, స్మిజ, అనిత, అరుణ, సుమలత, సంజన, షైన్నిక, గౌతమి, షమ్మీ, రజత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -