ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
నవతెలంగాణ – కరీంనగర్
కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అలుగునూరు ప్రాంత అభివృద్ధికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శనివారం రోజున కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన అలుగునూరు చౌరస్తా సహా పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్బంగా శిథిలమైన డ్రైనేజీలు, సీసీ రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే… వాటి మరమ్మత్తులు, అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అలుగునూరు జంక్షన్‌ను కరీంనగర్ నగరానికి ముఖద్వారంగా సుందరీకరించాలని కమిషనర్‌ను కోరారు.
అలాగే సదాశివపల్లి జంక్షన్ అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అలుగునూరు పరిధిలోని పలు కాలనీల్లో శిథిలమైన డ్రైనేజీల మరమ్మత్తులతో పాటు, కొన్ని చోట్ల కొత్త సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, “అలుగునూరు జంక్షన్ సుందరీకరణకు రూ. 4 కోట్లతో ప్రణాళిక సిద్ధమయ్యి, ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించాం. అలాగే సదాశివపల్లి జంక్షన్ అభివృద్ధికి రూ. 2.50 కోట్ల ప్రతిపాదనలు పంపినట్లు” తెలిపారు. డ్రైనేజీ, రోడ్ల సమస్యల పరిష్కారానికి ఇంజనీరింగ్ అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని, సంబంధిత కాలనీల్లో అభివృద్ధి పనులు తక్షణం ప్రారంభించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ సంజీవ్ కుమార్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అలుగునూరు అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES