జిల్లాశాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి
నవతెలంగాణ – ధర్మసాగర్
ఉపాధ్యాయుల సమస్యల సాధనయే పిఆర్టియు లక్ష్యమని పిఆర్టియు జిల్లా అధ్యక్షులు మండల తిరుపతిరెడ్డి అన్నారు. శనివారం పి ఆర్ టి యు మండల శాఖ అధ్యక్షులు అనిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి జాన్ సింగ్ ఆధ్వర్యంలో 2025-26 సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మండలంలోని పిఎస్ & హైస్కూల్ ధర్మసాగర్ (బాలికలు),పిఎస్ & హైస్కూల్ ధర్మసాగర్ (బాలురు),యుపీఎస్ ఎలుకుర్తి ,పీఎస్ ముప్పారం (వడ్డెర కాలనీ,) , పీఎస్ ,హైసూల్ దేవునూర్ ,కేజీబివి ధర్మసాగర్ పాఠశాలలను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ అన్ని క్యాడర్ల ఉపాధ్యాయుల ప్రమోషన్ల కు సంబంధించిన షెడ్యూల్ పీఆర్టీయూ ప్రాతినిధ్యంతో,గౌరవ ఎం ఎల్ సి శ్రీపాల్ రెడ్డి గారి చొరవతో విడుదల అయిందని తెలిపారు.
ఉపాధ్యాయుల అన్నిరకాల పెండింగ్ బిల్లులు, 2003 ఉపాధ్యాయులకు సి పి ఎస్ రద్దు చేసి, ఓ పి ఎస్ అమలు చేయాలని,పెండింగ్ లో ఉన్న ఐదు డి ఏ లను వెంటనే మంజూరిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.,ఉపాధ్యాయులందరికీ కాష్ లెస్ హెల్త్ కార్డులు , గ్రేటర్ వరంగల్ జిల్లాలో ఫెరి ఫెరీ నుండి 8 కి మీ వరకు హెచ్ఆర్ఏ పెంపు ,మెరుగైన పీఆర్సీ పిఆర్ టి యు రాష్ట్ర సంఘం & గౌరవ ఎంఎల్సీ శ్రీపాల్ రెడ్డి ద్వారా సాధించేందుకు వారు కృషి చేస్తారని తెలిపారు.రాష్ట్రంలో నెలకొన్న ఉపాధ్యాయుల సమస్యల సాధన కొరకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పీఆర్టీయూ లో సభ్యత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుకుమారస్వామి,వల్యానాయక్,జిల్లా సహ అధ్యక్షులు సరస్వతి,సంపత్ ,మండలశాఖ సహ అధ్యక్షులు శ్రీనివాస్ ఉపాధ్యాయులుతదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యల సాధనయే పీఆర్టీయూ లక్ష్యం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES