Sunday, August 3, 2025
E-PAPER
Homeకవితబండ(గుండె)లోతుల్లో

బండ(గుండె)లోతుల్లో

- Advertisement -

ఆ బండలోతుల్లోని శిశువు,
గుండెలోతుల్లో చూడు
ఆ కన్నీళ్లలో కనిపించేది
జీవితం అర్థం చేసుకోలేని ఆవేదన.
ఎముకలు కనిపించే ఆ క్షీణ దేహం,
పిడికిలి పట్టిన ఆ ఆత్మ ఆవేదన.
ప్రపంచం మౌనంగా చూస్తున్నప్పుడు
ఆ బాలుడి కన్నీరు ఆకాశాన్ని తాకేను.
మానవత్వం ఎక్కడ పోయిందో తెలియదు
నిర్దయతో కలిగిన ఈ కష్టం ఎందుకో?
తెలియని వయసు.
ప్రేమ, కరుణలు కనిపించని యుగం ఇది
ఆ శిశువు కోసం ఎవరూ సాయం చేయలేదు మరి
ఈ దశ్యమ్‌ ఎప్పటికి మనల్ని ఆలోచింపజేయాలి
సమాజ గుణం మారాలి
కారకులపై ఆక్రోశం రావాలి
మానవత్వపు కన్నీటి తడిలో
హదయాలు మెత్తబడాలి
ఆ చిన్న కన్నీళ్లలో ఆవేదన మరిపించలేం
ఆకలి ఇచ్చిన కడుపు నొప్పి తో
ఆత్రంతో ఆడుకునే హక్కు లేక
అమ్మ కూడా దగ్గరలో లేని ఆ దుఃఖం.
ప్రపంచం చూసీ-చూడనట్టు
మాత్రం నిద్రపోతుంది,
కానీ బాలుడి కేకలు ఎవరికీ వినబడవు
మానవత్వం మరచిన ఈ యుగంలో
శిశువు మోముపై నవ్వు మళ్లీ తెప్పించాలనే
ఆలోచన ఎలా కలిగించాలి.
మనం చేయాల్సిన సాయం ఎక్కడో మరచాం
ఆ చిన్న హస్తాలు
ఆపన్న హస్తాల కోసం ఎదురుచూస్తున్నాయి
ప్రతి ఒక్కరూ ఆలోచించి మారాలి
శిశువు బాధ తీర్చే దినం రావాలి.
-సాధనగౌడ్‌ తేరాల

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -