Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర.!

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర.!

- Advertisement -

తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర వస్తుందని తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు. శుక్రవారం పిఏసిఎస్ ఆధ్వర్యంలో నాచారం, ఎడ్లపల్లి  గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఏసిఎస్ వైస్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గ్రేడ్-ఏ క్వింటాలు ధాన్యం మద్దతు ధర రూ.2320, గ్రేడ్-బి క్వింటాలు ధర రూ.2300 పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మండల రాహుల్,జక్కుల వెంకటస్వామి యాదవ్, పిఏసిఎస్ సిబ్బంది, హమాలీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -