Sunday, August 3, 2025
E-PAPER
Homeమానవిఈ గింజలతో....

ఈ గింజలతో….

- Advertisement -

గుమ్మడి గింజల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో బాధపడేవారు గుమ్మడి గింజలు తింటే.. మేలు జరుగుతుంది. రోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటే.. పొట్ట నిండిన ఫీలింగ్‌ ఉంటుంది. దీనితో ఫుడ్‌ క్రేవింగ్‌ తగ్గుతుంది. ఎక్కువగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. గుమ్మడి గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుమ్మడి విత్తనాలలో ఉండే.. జింక్‌ ఇమ్యూనిటీని పెంచుతుంది.

క్యాన్సర్‌కు చెక్‌..
గుమ్మడి గింజల్లోని కెరొటినాయిడ్లు, విటమిన్‌ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. గుమ్మడి గింజలు తరచుగా తీసుకుంటే.. గ్యాస్ట్రిక్‌, ప్రోస్టేట్‌, బ్రెస్ట్‌, లంగ్‌, పేగు కేన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తనాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. నెలసరి నిలిచిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గటానికీ గుమ్మడి గింజలు తోడ్పడుతున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

గుండెకు మంచిది..
గుమ్మడి గింజల్లో మెగ్నీషియం మెండుగా ఉంటుంది. మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంచుతాయి. గుమ్మడి గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుమ్మడి గింజలు రక్తం కంట్రోల్‌ పీహెచ్‌ను క్రమబద్ధం చేస్తాయి. ఒత్తిడిని నివారిస్తాయి.

కండరాల ఆరోగ్యానికి మంచిది..
గుమ్మడి గింజలు కండరాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి గుమ్మడి గింజల్లో ప్రనాగమిక్‌ ఆసిడ్‌ ఉంటుంది. దీన్నే పనాగమేట్‌, బి-15 అని కూడా అంటారు. ఇది జీవకణంలో జరిగే సెల్‌ రెస్పిరేషన్‌ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..
షుగర్‌ పేషెంట్స్‌కు గుమ్మడి గింజలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి గింజల్లో యాంటీడయాబెటిక్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి. గుమ్మడికాయ విత్తనాలలో ట్రైగోనిలైన్‌, నికోటినిక్‌ యాసిడ్‌, డి-కైరో-ఐనాసిటాల్‌ అనే సమ్మేళనాలు సమద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతాయి.

జుట్టు స్ట్రాంగ్‌గా ఉంటుంది..
రోజూ చెంచా గుమ్మడి విత్తనాలను తీసుకుంటే జుట్టు దఢంగా ఉంటుంది. గుమ్మడి గింజల్లోని సెలెనియం, మెగ్నీషియం, ఐరన్‌, క్యాల్షియం, కాపర్‌, ఏ, బీ, సీ విటమిన్లు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి తింటే చుండ్రు సమస్య కూడా రాదు.న

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -