– కేరళ ఫిల్మ్ పాలసీ కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి పినరయి విజయన్
‘వివిధ రంగాల్లో ఇతర రాష్ట్రాలకు మోడల్‌గా నిలిచిన కేరళ, సినిమా రంగంలోనూ విధాన పరంగా ఆదర్శంగా నిలవగలదు. కేరళ ఫిల్మ్ పాలసీ మలయాళ సినీ పరిశ్రమ సమగ్ర అభివద్ధికి దోహదపడుతుంది’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు.
కేరళ రాజధాని తిరువనంతపురంలో రెండు రోజుల పాటు జరిగిన కేరళ ఫిల్మ్ పాలసీ కాన్‌క్లేవ్‌లో శనివారం పాల్గొన్న ఆయన ఈ కార్యక్రమం మలయాళ సినిమా పరిశ్రమకు సమగ్ర విధానాన్ని రూపొందించడమే లక్ష్యంగా జరిగిందన్నారు.
అలాగే మలయాళ సినిమాను ఆధునికీకరించి, విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఎందుకంటే ఇది మన సమాజ ఆర్థిక వ్యవస్థతో కలసి మిళితమై ఉంది. ఇది ఈ కాన్‌క్లేవ్ దిశగా ఒక ముందడుగు అవుతుందని ఆయన చెప్పారు. ఇప్పుడు సినీ పరిశ్రమలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. సహజంగానే వాటి మధ్య పోటీ భావన ఉంటుంది. అయితే, ఈ పరిశ్రమ తానే ఉండకపోతే సంస్థలు ఎలా ఉంటాయి అన్న అవగాహనతో ప్రతీ ఒక్కరు తమ అహంకారాన్ని పక్కనపెట్టి సమస్యలు పరిష్కరించడానికి కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
ఈ కాన్‌క్లేవ్ కొత్త ఆలోచనలు, అభిప్రాయాలు, సూచనల కోసం ఓ పాఠశాలవంటి స్వేచ్ఛాయుత వేదిక కావాలని ఆశిస్తున్నానన్నారు. అలాగే అత్యంత హింసాత్మక దశ్యాలు ఉన్న సినిమాలపై, మాదకద్రవ్యాలు, మద్యం వినియోగాన్ని చూపించే సినిమాలపై కూడా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరించారు.
సాంస్కతిక వ్యవహారాల శాఖా మంత్రి సాజీ చెరియన్ మాట్లాడుతూ, ‘ఈ కాన్‌క్లేవ్ కేరళను దేశంలోనే సినిమా అనుకూల రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మార్గదర్శిగా నిలుస్తుంది. ఇందుకోసం అవసరమైన మౌలిక సదు పాయాలు, మద్దతు యంత్రాంగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ కాన్‌క్లేవ్ కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది మహిళా సినీ ప్రముఖులు ముఖ్యమంత్రికి సమర్పించిన మెమోరాండంతో ప్రారంభమైంది. దానిపైనే హేమా కమిటీ ఏర్పాటు చేయబడింది. ఆ కమిటీ నివేదికలోని సూచనలతో పాటు, అదూర్ గోపాలకష్ణన్, ఇతర ముఖ్యుల సూచనలు కూడా ఈ కాన్‌క్లేవ్‌కు అడుగు పడేలా చేశాయి. ‘ అని తెలిపారు.
విలువలపై దాడి జరుగుతోంది
‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి రెండు అవార్డులు ఇచ్చిన వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మత విద్వేషం వ్యాపింపజేయడానికి ఉపయోగించే సాధనంగా ‘ది కేరళ స్టోరీ’కు జాతీయ అవార్డు ఇవ్వడాన్ని చూడొచ్చు. ఇతర పరిశ్రమలు పురాణ కథలపై ఆధారపడి సినిమాలు తీశాయి. అయితే మలయాళ సినిమా ప్రారంభం నుంచే సామాజిక స్పహతో కూడిన సినిమాలు తీసింది. కేరళ లౌకిక సంప్రదాయాన్ని అవమానించడంతో పాటు, రాష్ట్రాన్ని కించపరిచేలా చూపించిన సినిమాకు అవార్డు ఇవ్వడం దురదష్టకరం. మలయాళ సినిమా మానవతా విలువలతో కీర్తిని సాధించింది. ఇప్పుడు ఆ కీర్తికి పునాది అయిన ఆ విలువలపై దాడి జరుగుతోంది. సినిమా ద్వారా రాష్ట్రాన్ని కలుషితం చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రాష్ట్ర పౌర సమాజం, సినీ పరిశ్రమ ఒకటిగా నిలవాలి.
– కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
నూతన సినీ విధానం వల్ల మలయాళ సినీ పరిశ్రమ మరింత ప్రజాస్వామ్యాత్మకంగా మారుతుంది. ఎక్కువ మంది ప్రజలు సినిమా నిర్మాణ ప్రక్రియలో పాల్గొన డానికి ఇది అవకాశం కల్పిస్తుంది. అలాగే సినీ రంగానికి కొత్త దిశను ఇవ్వగలదని ఆశిస్తున్నాను’
– కథానాయకుడు మోహన్‌లాల్
కేరళ ఫిల్మ్ కాన్‌క్లేవ్ అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలుస్తుంది. – నటి, దర్శకురాలు సుహాసిని