ప్రతిపక్షాల తీవ్ర పోరాటం తర్వాత అని వార్యంగా పార్లమెంట్‌లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు ఒప్పుకున్న నరేంద్రమోడీ ప్రభుత్వం అడ్డగోలు ఆరోపణలతో అడుగడు గునా చర్చ ను దారి తప్పించేందుకు తంటాలు పడింది. ఆ రాజకీయ రసాభాషతో సామాన్య ప్రజలకు నిజంగా జరిగిందేమిటో ఒక పట్టాన బోధపడని పరిస్థితి. దేశం కోసం గొప్పగా పోరాడిన ఇది వరకు ఎన్నడూ లేనంత మోడీపై దాడి చేయడమేంటి? మరో దేశంతో యుద్ధం లేదా ఘర్షణ అన్నప్పుడు, అందరూ అధికార పార్టీకి మద్దతి వ్వాలి కానీ ప్రశ్నలేమిటి? ఇలాంటి వాటి వల్ల దేశం ప్రపం చంలో పల్చనైపోదా? విచారకరమైన అంటే మేధావులు వ్యాఖ్యాతలు అనుకునే వాళ్లు కూడా అటు ఇటు తిప్పి ఈ భాషనే మాట్లాడటం.వీటిపై చర్చించడానికి మోడీ ప్రభు త్వం బలవంతంగా, చాలా ఆలస్యంగా ఒప్పుకుంది. నిజంగా ఘన విజయం సాధించి ఉంటే ప్రతిపక్షాలు అడ గ్గానే సభను జరిపి గొప్పలు చెప్పుకునేదా కదా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన జోక్యంతో ఒత్తిడితో యుద్ధం ఆగి పోయిందని వార్త పాకిస్తాన్ ప్రపంచ మీడియాకే చెబుతూ ఉంటే కచ్చితంగా ఖండించిన దాఖలాలు లేవెందుకు? తర్వాత జరిగిన బ్రిక్స్ కామ షాంగై వేదికలలో కూడా ప్రధాని మోడీ దీనిపై ఎందుకు వ్యాఖ్యానించలేదు? మన గురించి ట్రంప్‌తో ఏ దశలను చర్చించలేదని డొంక తిరుగుడుగా చెబుతూ వచ్చిన విదేశాంగ మంత్రి జయశంకర్ ముఖాముఖిగా వ్యాఖ్యానాలను సమాధానమిచ్చేందుకు ఎందుకు వెనుకాడారు? పార్లమెంట్‌లో చర్చను ప్రారం భించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అయిన తనకు తానుగా ట్రంప్ ప్రక టనను ఖండించారా? ట్రంప్ చెప్పింది అబద్ధమని ఖండించే ధైర్యం చేయగలరా అని రాహుల్ గాంధీ సవాల్ చేసిన మోడీ దాన్ని స్వీకరించలేదే? ఏ చర్చ అయిన ముందు అసత్యాలను అపోహలను తోసి పుచ్చడంతో మొదలవుతుంది కదా? వెనక్కు తిరిగి చూసుకుంటే అసలు ఈ చర్చకు ఒప్పుకోవడంలో కూడా వ్యూహం ఉందని సందేహం కలుగుతుంది. ఎన్నికల సంఘం బీహార్‌లో 65 లక్షల మందిని తొలగించటం లక్ష్యం అని అధికారికంగా ప్రకటించిన సమయంలోనే ఇది ప్రారంభమైంది.. పట్టుబట్టి మరి ఈ చర్చకు అనుమతి సాధించిన ప్రతిపక్షాలు ఈసీ అధికార ప్రకటన తర్వాత దాని గురించి ముం దు మాట్లాడదామని వెంటపడాల్సి వచ్చింది. పెద్దగీత పక్కన చిన్నగీతలాగా బీహార్‌లో 70 లక్షల ఓట్ల గల్లంతుకు స్కెచ్ బహిర్గతమవుతున్న తరుణంలోనే ఈ చర్చను ముందుకు తెచ్చారన్నమాట
కీలకాంశాల దాట వేత
ఎప్పటిలాగే మతపరమైన ఊకదంపుడుతో కేంద్ర మంత్రులు చెలరేగిపోయారు. విస్తారమైన చర్చలకు కారణమైన కీలక మలుపులను స్పశించేం దుకు కూడా వెనుకాడారు. రఫెల్ జట్ల కూల్చివేత, భద్రత వైఫల్యాలు, ట్రంప్‌తో మంతనాలు, ఆయన ఆదే శాలు, కాల్పుల విరమణ కాగానే పాకిస్తాన్ సైనికా ధిపతి జనరల్ మునీర్‌తో విందు భోజనం, పాకిస్తాన్‌కు ఐలy ్‌యు చెప్పడం, మోడీని మాత్రమే మిత్రుడని ముక్తా యించడం ఊసే ఎత్తుకోలేదు. ఈ సమయంలోనే కాశ్మీర్‌లో పెహల్గామ్ దాడికి కారకులైన ము గ్గురు ఉగ్రవాదులను కాల్చివేసినట్లు వార్తలు రావడం కూడా బాలకోట్, పూరి సర్జికల్ స్ట్రైక్స్ వంటి వాటిని గుర్తుచేస్తుంది. ‘మేము ఉగ్రవాదులను హతమారిస్తే మీరు సంతో షిస్తారు అనుకున్నాను కానీ ప్రశ్నలు వేస్తున్నారని’ మోడీ,షాలు దెప్పి పొడిచారు. ఉగ్రవాదులు బయటినుంచి వచ్చారన డానికి ఆధారాలేమిటని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యను విష పూరితంగా దాడి చేశారు. తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ కాశ్మీర్‌ను కాపాడిన సంగతి వదిలేసి పివోకెను అప్పగించారని నింద వేశారు. నెహ్రూ సింధుజలాలు వదిలిపెడితే తమ అడ్డుకున్నామని అవాస్త వాలు గుప్పించారు. ఒక ఉగ్రవాద దాడిపై దర్యాప్తు అంటే వారు దేశంలో దాక్కున్నారా? కేవలం బయటి నుంచి వచ్చారా? అన్నది తప్పక విచారించాల్సిందే. సోనియాగాంధీ అత్త ఇందిరాగాందీ,ó భర్త రాజీవ్ గాంధీలు కూడా ఉగ్రవాదానికి జాతిద్వేషానికి బలైపోయారు. అలాంటి వ్యక్తి ఉగ్రవాదుల కోసం కన్నీరు కార్చారని అబాండం వేయటం అమానవీయం. దాడులు ఎందుకు విరమించారో సమగ్రంగా చెప్పాలని అడగడమే పాకి స్తాన్‌కు అనుకూలత అంటే దారుణం కాదా? కాల్పుల విర మణలో బయటి దేశాల పాత్రలేదని మీరు అంటున్నప్పుడు తాను ఆ పాత్ర నిర్వహించారని చెబుతున్న ట్రంప్ మాట అబద్ధమని ప్రకటించడానికి ఆటంకమేమిటి?ఈ దాగుడు మూతల వెనుక దగాకోరు వ్యూహమేంటి?
ఈ చర్చనే తప్పా?
తెలిసో తెలియకో కొంతమంది పదే పదే చెబుతు న్నట్లు దేశాల మధ్య యుద్ధాలు, ఘర్షణలు అత్యున్నత సభల్లో చర్చకు రావడం తప్పు కాదు, తప్పనిసరి. యుద్ధా ల మధ్యలోనే అధినేతలను ప్రభుత్వాలను మార్చి వేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. దేశభద్రత ఎప్పుడూ రహస్య చర్చకాదు. విదేశాంగ విధానం రాజకీయ పార్టీల ప్రజల విశాల ఏకాభిప్రా యంతో రూపొందాలి తప్ప పీఠంపై కూర్చున్న వారి చిత్తవత్తిని బట్టి కాదు.విదేశాంగ విధానం ప్రజల చర్చిలో లేకపోవడం ఒక పెద్దలోపం. పాతికేళ్ల క్రితం వరకు అనుసరించిన అలీన విధానం వంటివి మొత్తమ్మీద సరిగానే ఉన్నా వాటిపై ప్రజారాశుల్లో చర్చ లేకపోవడం సరికాదని సీపీఐ(ఎం) ప్రతి మహా సభలో చెబుతుండేది.
ప్రజల ప్రత్యక్ష పాత్ర లేకపోవడం వల్లనే పాలక పార్టీలు తమ ప్రయోజనాలకు అను గుణంగా విదేశాంగ విధానంతో చెలగాటమాడటం సాధ్యమవుతుంది. సోవి యట్ విచ్ఛిన్నం తర్వాత అక్షరాల అదే జరుగుతున్నది. అమెరికా అధ్యక్షుడితో, వారి అనుబంధ కూటములతో అంట కాగుతున్న మోడీ దాన్ని పరాకాష్టకు చేర్చారు. బడి పిల్లల్లా భారత,పాకిస్తాన్ నేతలను దారికి తెచ్చానని ట్రంప్ చెప్పుకుంటే కాదనడానికి కేంద్రం వెనుకాడుతు న్నదంటే నిజం అదేనని అర్థం కాదా? ఇంతగా వారికి లోబడి పోయిన తర్వాత కూడా ట్రంప్ భారతదేశంపై ఇరవై ఆరుశాతం టారిఫ్‌లు ప్రకటించడం, రష్యా దగ్గర చమురుకొంటున్నందుకు తిట్టిపోయడం చూస్తే మోడీ సర్కార్ ఎంతగా లోబడిపోయిందో అర్థమవుతుంది. ఇక్కడ గమనించవలసినవి రెండు. మోడీ ఇష్టానుసారం విదేశాంగ విధానంలో విన్యాసాలు, దానిపై అవతల పెత్త నం చేసే వారు ఏం చెప్పినా వివరాలు దేశంతో పంచు కోకపోవడం. ఒక ప్రజాస్వామ్య దేశానికి ఇది ప్రమాదకర సంకేతమే.
మతాలవారీ రాజకీయమేంటి?
ఇక ఈచర్చలో బీజేపీ మతతత్వ ధోరణి మరింత ప్రమాదకరమైంది.ఉగ్రవాదులు కుట్రదారులు కనుక పథకం ప్రకారం మత ప్రాతిపదికన హత్యకాండకు పాల్పడ్డారు కానీ కేంద్రం, రాజకీయ వ్యవస్థ ప్రజాస్వా మికంగా వెళ్లడం వాటి బాధ్యత. కానీ ఆపరేషన్ సిందూర్ పేరు దగ్గరనుంచి ఇప్పుడు మహదేవ వరకూ మొత్తం ఒకే మత చిహ్నాల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్ నాయ కత్వాన్ని ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని పరదేశీ యులు గా, పరమతాన్ని బలపరిచేవారుగా చూపించటం, లౌకిక వాద పక్షాలను అపహస్యం చేయటం సంఘ పరివార్ పోకడలకు ప్రతిబింబమే. సోషల్ మీడియాలో విమర్శ లను తట్టుకోలేని పరివార్యులు అవతలివారిని పాకిస్తాన్, చైనా ఏజెంట్లుగా హిందూవ్యతిరేకులుగా చిత్రిస్తూ ఉం టారు. రాజకీయాలు ఎలావున్నా దేశ హోం మంత్రి కూడా ఆ స్థితికే చేరడం క్షేమదాయకం కాదు. ఉగ్రవాదాన్ని ఒక మతానికే పరిమితం చేస్తూ అమిత్‌షా ”హిందువుల్లో ఎవరు ఉగ్రవాదులు కాబోరని కారని నేను గర్వంగా చెప్పగలను” అంటూ చెలరేగిపోయారు. అదేదో ఆవేశంలో అన్నారనుకుంటే ఆ మాట్లాడిన వార్తల క్లిప్పింగును అధికార ఖాతాలో పెట్టుకున్నారు. కానీ అంత ర్జాతీయంగా ఇస్లామిక్ తీవ్ర వాదమన్నది ఉన్నమాట నిజం. మొదట దాన్ని సష్టించింది, పోషిస్తున్నది అమెరికా కూటమన్నది అందరికీ తెలిసిందే. దేశంలో ఉన్నది అ దొక్కటేనా? సిక్కు ఉగ్రవాదం ఇందిరాగాంధీ హత్యవెనక ఉండటమేకాక చాలా పరిణామాలకు కారణమైంది.(వారిపైనా హత్యా కాండ సాగింది) శ్రీలంక సమస్య ఎల్‌టిటిఈ టైగర్ల ఉగ్రవాదానికి దారితీసి రాజీవ్‌గాంధీ హత్యకు కారణ మైంది. అహింస ప్రచార కేంద్రంగా ఉండే బౌద్ధం కూడా శ్రీలంకలో సింహళ ఉగ్రవాదానికి కొంతవరకూ దోహదం చేసింది. అస్సాంలోనూ ఒక దశలో అనేక విధాలైన మత, జాతి టెర్రరిజం చూసాం. ఇంకా సమస్య పోలేదు కూడా ఈశాన్య భారతంలోనూ వివిధ రకాల బృందాలున్నాయి. వీటికి సామాజిక రాజకీయ కారణాలూ ఉన్నాయి.పశ్చిమ యూరప్‌లో, అమెరికాలో కూడా భయానకమైన జాత్య హంకార మాఫియా ముఠాలున్నాయి. సరిగ్గా ఈ సమ యంలో గాజాలో అరవైవేల మంది ప్రాణాలు తీసిన యూదు జాత్యహంకారం రాజ్యప్రేరిత ఉగ్రవాదంగా కొన సాగుతున్నది. కనుక ఉగ్రవాదం ఏదో ఒక మతానికి పరిమితమైనట్లు చెప్పడం- అది కూడా దేశ భద్రతకు బాధ్యత వహించవ లసిన హోంమంత్రి నోట ఆ మాటలు రావడం మరీ ఆందోళనకరం. రైళ్ల పేలుళ్ల కేసులో స్వామి ఆసిమానందను, మాలెగావ్ పేలుళ్లలో సాధ్వి ప్రజ్ఞా ఠాగూర్‌ను ఈ సమయంలోనే కోర్టులు నిర్దోషులుగా ప్రకటించటం యాదచ్ఛికమైనా వాటిపై ఉన్నత న్యాయస్థానాల్లో విచారణ కొనసాగించవచ్చు. రాజ్యసభలో ఈ చర్చకు సమాధానం ఇచ్చే బాధ్యతను దాటవేసిన ప్రధాని మోడీ వారణాసి వెళ్లి దేవదేవుని ఆశీస్సులతో ఉగ్రవాదాన్ని ఎదుర్కొ న్నానని ప్రకటించడం వెనక ఉన్నదీ మత రాజకీయాలే. భిన్న మతాలతో కూడిన ఈ దేశంలో ఈ విధంగా కేంద్ర ప్రభు త్వం ఒక మతానికి అందులోనూ 70,80శాతం జనాభా ఉన్నవారికి ఉగ్రవాద రహితమైం దిగా కితాబునిస్తే శాంతి భద్రతల వ్యవస్థ, దేశ భద్రత ఎటుపోవాలి? రాబోయే అ సెంబ్లీ ఎన్నికల కోసం స్వీయ రాజకీయాల లంపటంలో మునిగితేలుతున్న బీజేపీ నాయకత్వానికి ఇవన్నీ పట్టవు.
ఏమైనా ఆపరేషన్ సిందూరపై ప్రజాస్వామికంగా చర్చించి అందర్నీ కలుపుకునిపోయే విధంగా సమాధాన మిచ్చే బదులు ఎదురుదాడితో రాజకీయ మతపరమైన విభజనకు ప్రయత్నించటం ఎంతమాత్రం సరైంది కాదు. జాతీయ పత్రికల సంపాదకీయాలతోపాటు విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన నిరుపమారావు లాంటి వాళ్లు కూడా ఇదే చెప్పడం గమనించదగింది. ఈ చర్చ సమయంలో కాంగ్రెస్ నాయకత్వం చైనాతో సంబం ధాలపై చేసిన వ్యాఖ్యలన్నీ సరైనదిశలో ఉన్నాయని చెప్ప లేము. కానీ చైనా, పాకిస్తాన్‌లను ఒకేగాటకట్టే కమ్యూ నిస్టు వ్యతిరేక జాడ్యం కూడా సమంజసం కాదని తదుపరి పరిణామాల్ని చెబుతున్నాయి. దేశభద్రత కోణంలో మత సామరస్యం, లౌకికతత్వ విధానాలు కీలకమైతే విదేశాంగ విధానంలో సార్వభౌమత్వ పరిరక్షణ,ఆధిపత్యాలను నిరా కరించటం, ప్రపంచ శాంతికోసం చేతులు కలపడం కీలకమవుతాయి.
తెలకపల్లి రవి
దబాయింపులు, దాడుల ‘ఆపరేషన్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES