నవతెలంగాణ-హైదరాబాద్: కేరళలోని విజింజం అంతర్జాతీయ సీపోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా చాలామందికి (ఇండియా బ్లాక్ నేతలకు) నిద్ర లేకుండా చేస్తానని పరోక్షంగా కాంగ్రెస్ నేతలనుద్దేశించి మోడీ వ్యాఖ్యానించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు. తాము ప్రశాంతంగా నిద్రపోతామని, నిద్రపోవడం ప్రధాని మోడీకి కష్టతరం కానుందని వేణుగోపాల్ ఎద్దేవా చేశారు. జనగణన అమలు, రిజర్వేషన్‌లపై 50 శాతం పరిమితి తొలగింపు కోసం తాము కేంద్రంపై తీవ్ర ఒత్తిడి పెంచుతామని అన్నారు. ‘పీఎం ఏ ఉద్దేశంతో చాలా మందికి నిద్రలేకుండా చేస్తానని అన్నారో నాకు తెలియదు. కానీ నిద్రలేని రాత్రులు గడిపే వాళ్లలో పీఎం కూడా ఒకరు. అందులో ఇండియా బ్లాక్ గానీ, రాహుల్‌గాంధీ గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ ఉండదు.’ అని వ్యాఖ్యానించారు.
మేము ప్రశాంతంగా నిద్రపోతాం: కేసీ వేణుగోపాల్
- Advertisement -
RELATED ARTICLES