నాంపల్లి కోర్టు ఆదేశం
కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..
నవతెలంగాణ – ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లిలోని ప్రజాప్రతి నిధుల కోర్టు శనివారం ఆదేశించింది. గతంలో ఫోన్‌ట్యాపింగ్, డ్రగ్స్‌తో పాటు ప్రముఖ నటి సమంత విడాకుల కేసుకు సంబంధించి బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సురేఖపై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోర్టులో కేటీఆర్ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే. దీనికి సంబంధించి కేటీఆర్ తరఫు న్యాయవాదులు చేసిన వాదనలు, కొంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను పరిగణలోకి తీసుకున్న కోర్టు మంత్రిపై కేసు నమోదుకు ఆదేశించింది.
అది సాధారణమే..:మంత్రి సురేఖ
తప్పుడు వార్తలు రాసి ఆనంద పడటం సరికాదని మంత్రి కొండా సురేఖ హితవు పలికారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై నమోదు చేసిన పరువు నష్టం దావాపై రెండు రోజుల క్రితమే కాగ్నిజెన్స్ తీసుకుని ముందుకు వెళ్లాలని కోర్టు చెప్పిందని గుర్తు చేశారు. దీనికే కొందరు అత్యుత్సాహంతో వార్తలు రాస్తున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ మీద తమకు గౌరవముందని పేర్కొన్నారు. ఏ కేసులో అయినా కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలని చెప్పడం సాధారణమని తెలిపారు. కోర్టులు, కేసులు తమకు కొత్తకాదని పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES