Sunday, August 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం50 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు?

50 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు?

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్‌ ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఢిల్లీకి 50 సార్లు వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి ఏం సాధించారు? అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ప్రశ్నించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం ఢిల్లీ పర్యట నలతో నయాపైసా ప్రయోజనం కలగ లేదని తెలిపారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఫైల్స్‌తో కాకుం డా ఫ్లైట్‌ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోడీ, చంద్రబాబుల ముద్దుల బానిసగా తెలంగాణ ప్రయోజనాలను రేవంత్‌ తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. పాలించే ముఖ్యమంత్రి కావాలి కాని, ఢిల్లీకి విహార యాత్రలు చేసే టూరిస్ట్‌ సీఎం అవసరం లేదన్నారు. ముగ్గురు యజమా నుల ముద్దుల బానిస అయిన రేవంత్‌ రెడ్డి తన మొదటి బాస్‌ రాహుల్‌ గాంధీకి నోట్ల కట్టల మూటలు మోస్తూ పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రెండో యజమాని మోడీకి సన్నిహితులైన వ్యాపారవేత్తలకు తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేసుల నుంచి తప్పించుకుం టున్నారని తెలిపారు. మన అన్నదాతల కడుపు కొట్టి తెలంగాణ జల సంపదను తన మూడో యజమాని చంద్రబాబుకు దోచి పెడుతున్నారన్నారని చెప్పారు. ఢిల్లీ యాత్రలతో రాష్ట్రానికి సాధించింది ఏమి టో దమ్ముంటే రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడు దల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఒక్క కొత్త ప్రాజెక్టుకు అనుమతులు కాని, అదనంగా కేంద్రం నుంచి నిధులు, రాష్ట్రం కోసం ఓ ప్యాకేజీ అయినా సాధించారా అని ప్రశ్నించారు. బనకచర్లతో వ్యవసా య రంగం పెను సంక్షోభంలోకి కూరుకు పోతుందని తెలంగాణ తల్లిడిల్లుతుంటే రేవంత్‌ రెడ్డి గురువు చంద్రబాబుకు వ్యతి రేకంగా పల్లెత్తు మాట కూడా మాట్లాడడం లేదని తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడంతో సాగు నీళ్లు రాక రైతన్నలు ఇబ్బందులు పడు తుంటే సీఎంకు సోయి లేదన్నారు. హామీ లు అమలు చేయని రేవంత్‌ రెడ్డి తెలంగా ణకు తెచ్చింది…. శుష్కప్రియాలు..శూన్య హస్తాలే అని కేటీఆర్‌ విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -