- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వారం రోజుల ముందు గానే అమర్ నాథ్ యాత్ర ముగిసింది. జమ్మూ కశ్మీర్‌లోని కొండ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఉన్నందున అధికారులు యాత్రను రద్దు చేశారు. భారీ వర్షం కారణంగా యాత్రా మార్గాలు చాలా దెబ్బతిన్నాయని, బాల్టాల్, పహెల్గాం మార్గాల్లో మరమ్మతు పనులు జరుగుతాయి కాబట్టి యాత్రను నిలిపివేస్తున్నట్టు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురీ తెలిపారు. యాత్రను తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఆదివారం నుంచి అన్ని మార్గాల్లో యాత్రను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాగా, అమర్ నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9 వరకు యాత్ర కొనసాగాలి.
- Advertisement -