నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని అమీర్ నగర్ లో ఇద్దరు లబ్ధిదారులకు రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఎడ్ల హారిక, వర్ణం గంగాధర్ లు అనారోగ్యాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుని ఆర్థిక సహాయం కోసం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని సంప్రదించారు. ఆయన చొరవతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయం చెక్కులను మంజూరు చేసింది. అట్టి చెక్కులను సోమవారం స్థానిక బిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు.
ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాలవత్ ప్రకాష్, కోన సముందర్ సింగిల్ విండో వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గంగం గంగారెడ్డి, నాయకులు క్యాతం రాజేందర్, రాము, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES