నవతెలంగాణ – కట్టంగూర్
కట్టంగూరు మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పి.యాదగిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పని చేస్తున్న ఎల్.వెంకటేశ్వర్‌రావు స్థానంలో నకిరేకల్ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న పి.యాదగిరికి
( పూర్తి అదనపు బాధ్యతలు) అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రైతులు మధ్యవర్తులను సంప్రదించకుండా నేరుగా దరఖాస్తులు చేసుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. డీటీ ప్రాంక్లిన్ ఆల్భట్, ఆర్ఐ కుమార్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది నూతన తహసీల్దార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కట్టంగూర్ ఇన్‌చార్జి తహశీల్దారుగా యాదగిరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES