నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ (హెచ్‌సిసిబి), నేడు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో తమ సమగ్ర సీఎస్ఆర్ కార్యక్రమం: ప్రాజెక్ట్ షైన్ కింద పలు సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాలలో ఆరోగ్య శిబిరాలు, ప్రజారోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, పాఠశాలల్లో పారిశుధ్య ప్రాజెక్టులు, మహిళలకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు మరియు పర్యావరణ అనుకూల రీతిలో వ్యర్థాల నిర్వహణ పరిష్కారాలు వంటివి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యల శాఖల మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్, గౌరవనీయ శాసనసభ సభ్యులు ( గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు జిల్లా) డాక్టర్ వి ఎం థామస్, చిత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో స్థానిక అధికారులు, సమాజ సభ్యులు మరియు లబ్ధిదారుల సమక్షంలో ఈ కార్యక్రమాలను ప్రారంభించారు.
గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సంరక్షణ అవకాశాలను మెరుగుపరచడానికి హెచ్‌సిసిబి కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమం కింద, చౌడేపల్లె, శాంతిపురం, తవణంపల్లె, పాలసముద్రం, బుగ్గ అగ్రహారం మరియు బైరెడ్డిపల్లె గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. స్థానిక ప్రజలకు అవసరమైన వైద్య సేవలను ఇవి అందిస్తున్నాయి. అంతేకాకుండా, శస్త్రచికిత్స , అత్యవసర వైద్య చికిత్స సౌకర్యాలను మెరుగుపరచడానికి, శాంతిపురం, విజయపురం, పాలసముద్రం, చౌడేపల్లె మరియు తవణంపల్లెలోని ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో హైడ్రాలిక్ ఓటి టేబుల్స్, ఓటి హెడ్‌లైట్లు, ఇన్‌స్ట్రుమెంట్ ట్రాలీలు, వర్టికల్ ఆటోక్లేవ్‌లు, మల్టీపారా మానిటర్లు మరియు ఎయిర్ కండిషనర్‌లతో సహా ఆధునిక వైద్య పరికరాలను కంపెనీ అందించింది. అదనంగా, ఇది చౌడేపల్లె మరియు పాలసముద్రంలోని ప్రజారోగ్య కేంద్రాలలో (పిహెచ్ సి లు) కొత్త మరుగుదొడ్లను నిర్మించింది.
పాఠశాలల్లో మెరుగైన పారిశుధ్య సౌకర్యాల అవసరాన్ని గుర్తించిన హెచ్‌సిసిబి నంజంపేటలోని జెడ్ పిహెచ్ఎస్ వద్ద కొత్త మరుగుదొడ్డి నిర్మించింది. ఇది విద్యార్థులకు మెరుగైన పరిశుభ్రత , పారిశుధ్య ప్రమాణాలను నిర్ధారిస్తుంది. పర్యావరణ అనుకూల పరిష్కారాలకు కట్టుబడి ఉండటంలో భాగంగా, బంగారుపాళెం గ్రామంలో పది సోలార్ లైట్లను కంపెనీ ఏర్పాటు చేసింది, ఇది మెరుగైన కమ్యూనిటీ మౌలిక సదుపాయాలు , భద్రతకు దోహదపడుతుంది.
నైపుణ్యాభివృద్ధి మరియు ఆర్థిక సమ్మిళితత ద్వారా మహిళలను శక్తివంతం చేయటమనేది ప్రాజెక్ట్ షైన్ యొక్క ప్రధాన లక్ష్యం. తొండమనాడు, పిఆర్ కండ్రిగ, అక్కుర్తి మరియు చల్లపాళెం గ్రామాలకు చెందిన స్వయం సహాయక బృందాలకు (ఎస్‌హెచ్‌జిలు) కుట్టు యంత్రాలను హెచ్‌సిసిబి అందిస్తోంది, వీటి ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం పొందగలుగుతున్నారు. అదనంగా, కంపెనీ మహిళలకు వాష్ (నీరు, పారిశుధ్యం & పరిశుభ్రత), అమ్మకాలు & మార్కెటింగ్ మరియు డిజిటల్ & ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణా సెషన్‌లను నిర్వహిస్తోంది, జీవనోపాధి అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను వారికి అందిస్తోంది.
సురక్షితమైన తాగునీటి లభ్యత అనేది హెచ్‌సిసిబి యొక్క సీఎస్ఆర్ కార్యక్రమాలలో కీలకమైన అంశం. తిరుపతిలోని శ్రీకాళహస్తి మండలం అక్కుర్తిలో నీటి వడపోత యూనిట్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. దీని ద్వారా గ్రామస్తులకు సురక్షితమైన తాగునీటిని సంస్థ అందిస్తుంది, వారి జీవన నాణ్యతను పెంచుతుంది. అదనంగా, తిరుపతిలోని చెర్లోపల్లిలో ఒక ఆర్‌ఓ ఫిల్టర్‌ను సైతం ఏర్పాటు చేసింది. ఈ కమ్యూనిటీ-కేంద్రీకృత కార్యక్రమాలు కీలకమైన అవసరాలను తీర్చడానికి , అభివృద్ధిని ప్రోత్సహించడానికి హెచ్‌సిసిబి అంకితభావాన్ని వెల్లడిస్తాయి.
పర్యావరణ అనుకూల రీతిలో వ్యర్థాల నిర్వహణను ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా, చల్లపాలెం గ్రామ పంచాయతీ, కాపుగున్నేరి గ్రామ పంచాయతీ మరియు తొండమాన్ పురం గ్రామానికి వ్యర్థాల సేకరణ కోసం విద్యుత్ వాహనాలను హెచ్‌సిసిబి విరాళంగా ఇచ్చింది. ఈ కార్యక్రమం సమర్థవంతమైన మరియు పర్యావరణ అనుకూలమైన రీతిలో వ్యర్థాల తొలగింపు పద్ధతులకు మద్దతు ఇస్తుంది, సమాజాభివృద్ధికి దోహదపడుతుంది.
ఈ కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య శాఖల మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్‌లో సమాజ అభివృద్ధికి పూర్తి నిబద్ధతను చూపుతున్న హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్‌ను నేను అభినందిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణ సదుపాయాల లభ్యత , పారిశుధ్యం , నైపుణ్య అభివృద్ధి వంటి కీలకమైన రంగాలపై వారి దృష్టి నేరుగా స్వావలంబన ఆంధ్రప్రదేశ్ అనే మా ఉమ్మడి లక్ష్యానికి దోహదపడుతుంది. వారి కార్యక్రమాలు గ్రామీణ ఆరోగ్యం, మహిళా సాధికారత , పర్యావరణ అనుకూల వ్యర్థాల నిర్వహణపై మా ప్రభుత్వం లక్ష్యంకు అనుగుణంగా ఉన్నాయి . మా ప్రజారోగ్య కేంద్రాలను (పిహెచ్ సి ) ఆధునీకరించటం , స్వచ్ఛమైన తాగునీటిని పొందడం , స్వయం సహాయక బృందాలకు చురుకుగా మద్దతు ఇవ్వడం ద్వారా, హెచ్‌సిసిబి మన ప్రజల శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. ఇటువంటి బలమైన భాగస్వామ్యాలు మన ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభావవంతమైన , దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించడం కొనసాగిస్తాయని నేను విశ్వసిస్తున్నాను” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్ట్ షైన్ ప్రభావాన్ని గురించి హెచ్‌సిసిబి చీఫ్ పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్, సస్టైనబిలిటీ ఆఫీసర్ హిమాన్షు ప్రియదర్శి చెబుతూ “కమ్యూనిటీలను వారి అత్యంత క్లిష్టమైన సవాళ్లను నేరుగా పరిష్కరించే కార్యక్రమాల ద్వారా బలోపేతం చేయడానికి మేము హెచ్‌సిసిబి వద్ద కట్టుబడి ఉన్నాము. మా కమ్యూనిటీ భాగస్వామ్య కార్యక్రమాల ద్వారా, మేము ప్రజా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, సురక్షితమైన తాగునీటిని పొందడం, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్యను ప్రారంభించడం , తాము సేవలందించే సమాజాలకు మెరుగైన జీవన నాణ్యతను నిర్ధారించడానికి జీవనోపాధి అవకాశాలను సృష్టించడంపై దృష్టి పెడుతున్నాము . ఈ క్రమంలో ప్రభుత్వ మద్దతుకు మేము ధన్యవాదములు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో మా పెట్టుబడిని కొనసాగించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.
ప్రాజెక్ట్ షైన్ ఐదు ప్రధాన అంశాలపై నిర్మించబడింది: పర్యావరణం & విపత్తు నిర్వహణ కోసం పర్యావరణ అనుకూల పరిష్కారాలు, వాష్ కార్యక్రమాల ద్వారా ఆరోగ్యం & పరిశుభ్రత, మహిళా సాధికారత & జీవనోపాధి ద్వారా సమగ్ర వృద్ధి, విద్య & నైపుణ్య నిర్మాణంతో సంభావ్యతను పెంపొందించడం మరియు మెరుగైన భవిష్యత్తు కోసం కమ్యూనిటీలను సాధికారపరచడం. ప్రాజెక్ట్ షైన్ ద్వారా, ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు , యువతకు ఆరోగ్యం , పరిశుభ్రత అవగాహన కార్యక్రమాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాజెక్టులు, నైపుణ్య అభివృద్ధి శిక్షణతో సహా వివిధ సీఎస్ఆర్ కార్యకలాపాలను హెచ్‌సిసిబి కొనసాగిస్తోంది. ఇప్పటివరకు, హెచ్‌సిసిబి ప్రయత్నాలు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వ్యక్తులపై సానుకూల ప్రభావాన్ని చూపాయి. అదనంగా, హెచ్‌సిసిబి 4,000 మందికి పైగా మహిళలకు డిజిటల్ & ఆర్థిక అక్షరాస్యత శిక్షణను అందించింది. సౌర వీధి దీపాలను ఏర్పాటు చేయడం, ప్రజారోగ్య మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం వంటి కీలకమైన సీఎస్ఆర్ ప్రాజెక్టులను అమలు చేసింది.
ఐదు వేల మంది యువ నిపుణులకు అమ్మకాలు , మార్కెటింగ్ శిక్షణ అందించడం లక్ష్యంగా హెచ్‌సిసిబి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపిఎస్ఎస్ డిసి)తో కూడా భాగస్వామ్యం చేసుకుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే 7,650 మందికి పైగా వ్యక్తులకు శిక్షణ ఇచ్చింది, ఇది ప్రారంభ లక్ష్యాన్ని మించిపోయింది. అవగాహన ఒప్పందం (ఎంఓయు) ద్వారా అధికారికీకరించబడిన ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలు : విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు మరియు చిత్తూరు కు విస్తరించింది.
ఆంధ్రప్రదేశ్ అంతటా సమ్మిళిత మరియు స్థిరమైన వృద్ధిని నిర్ధారించడం ద్వారా స్థానిక సంఘాలు మరియు ప్రభుత్వ వాటాదారులతో దగ్గరగా పనిచేయడం ద్వారా అర్థవంతమైన మార్పును పెంపొందించడానికి హెచ్‌సిసిబి కట్టుబడి ఉంది.